ఆటలు పాటలు;--గద్వాల సోమన్న,9966414580.
ఆటలు ప్రాణము పిల్లలకు
పాటలు ఇష్టము కూనలకు
ఆటల పాటలతో దొరుకును
నూతనోత్సాహం మనసులకు

మెండుగా పంచు ఆరోగ్యము
నిండుగా ఉంచు ఆనందము
ఆటల పాటలతో దొరుకును
మితిలేని వినోదము వికాసము

మానసికంగా ఎదిగేందుకు
శారీరకంగా పెరిగేందుకు
ఆటల పాటలతో సాధ్యము
ఉత్తేజమే పొందేందుకు

చెమట రూపంలో మలినాలు
కాయం నుంచి తరిమేందుకు
అవసరమే  ఆటలు పాటలు
చురుకుదనమే పెంచేందుకు


కామెంట్‌లు