అలలు నేర్పు పాఠము;- -గద్వాల సోమన్న,9966414580.
అలల ఆరాటం చూడు
వాటి పోరాటం  చూడు
అనిశమ్ము గెలవాలనే
దృఢ సంకల్పం చూడు

ఎన్ని సార్లు ఓడినా
నిరాశ ఎంత కలిగినా
అలల గుండె నిబ్బరాన్ని
సానుకూల దృక్పథాన్ని

కాసింత నేర్చుకుంటే
విజయాలిక

మన వెంటే
బ్రతుకంతా ఆనందము
అమితమైన ఆరోగ్యము

అలలు నేర్పు గుణ పాఠము
ఆచరించు సన్మార్గము
నేర్చుకుంటే జీవితము
అగును సంతస సాగరము

కామెంట్‌లు