అదృష్టం ఆడపిల్ల;- -గద్వాల సోమన్న,9966414580
బాలిక ఇంటిలోన
తారక మింటిలోన
గొప్పగా చదివితే
ఎదుగును బ్రతుకులోన

దీవెన జగతిలోన
వంతెన మమతలోన
ఆదరిస్తే మనము
దీపిక గృహంలోన

అందము అవనిలోన
బంధము గుండెలోన
ఆడపిల్ల అదృష్టం
అనుకోకు దురదృష్టం

ఇంట ఉన్న కళకళ
ఉట్టిపడును జీవకళ
బాలిక లేకుంటే
పోవు ఇల్లు వెలవెల


కామెంట్‌లు