అయోధ్య రామ మందిర నిర్మాణం సందర్భంగా పద్యాలు- ఉండ్రాళ్ల రాజేశం సిద్దిపేట9966946084
ఆటవెలది అక్షరమాల-
==================

1) రాములోరి చరిత రమణీయ కావ్యము
నింగి నేల మురియు నిశ్చయముగ
భరతభూమి ఘణత భాగ్యమయ్యోద్యగా
రామజన్మభూమి రామజపము

2) దేశమంత నేడు దేదీప్యమానమై
గడప గడప నిలిచి కలుసుకొనుచు
అక్షితలను పంచి లక్షణంబుగ సాగు
రామజన్మభూమి రామజపము

3) బాలరాముడంట భారతావనినందు
కొలువు దీరనుండు కోట్లప్రభల
పిన్న పెద్దలంత పేర్మితో పూజలు
రామజన్మభూమి రామజపము

4) రామరామ యనుచు రాజిల్లి జనులంత
కదులుతున్న తీరు కవనమయము
సకల బాటలన్ని సాగునాయ్యోద్యకు
రామజన్మభూమి రామజపము

5) పల్లె పట్నమందు పర్వమై సంబ్రము
రామ భజనతోడ రాగమయము
జగతి చూపులన్ని స్వేచ్ఛగాయ్యోద్యకు
రామజన్మభూమి రామజపము

6) రామలల్ల యనుచు సామిని మొక్కుచు
పూజ చేయు జనుల పుణ్యఫలము
భక్తి పరవశమున భరతావని నడువ
రామజన్మభూమి రామజపము

7) సకల జనుల దరువు సమరస భరితము
హిందు సింధుయనుచు చిందులేయు
రమణ భాషితంబు రామస్మరణతోడ
రామజన్మభూమి రామజపము

8) కనుల ముందు నిలిచి కనువిందు చేయుచు
గుండెలందు చేరి నిండుగుండె
కార్యసాధనందు కాషాయ దళముతో
రామజన్మభూమి రామజపము

9) నిండుకుండ వలెను నిలువెత్తు రూపము
నిన్ను చూడవలెను నిమ్మలముగ
దర్శనంబునిమ్ము దళపతి రామయ్య
రామజన్మభూమి రామజపము

10) కష్టమైన చోట కదలాడు క్షణమున
బాల రాముడొచ్చి బాధతుడుచు
శరణు శరణు రామ సకలము కాపాడు
రామజన్మభూమి రామజపము


కామెంట్‌లు