పెద్దలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 నేడు పెద్దలంటే గౌరవం మర్యాద తగ్గిపోతోంది.ఇంటికి
ఎవరైనా వస్తే కుర్చీ లోంచి లేచి రండి ఆంటీ అంకుల్ అనే పిల్లలు కరువైనారు.హాయిగా కాలుమీద కాలేసుకుని టి.వి.చూస్తూ మమ్మీ అని కేకవేస్తారు.ఇంట్లో అమ్మమ్మ బామ్మ తాతలకి గౌరవం ఇవ్వడం లేదు.దీనికి కారణం అమ్మ నాన్నలు చెప్పకపోటం.బడిలో 5 వక్లాస్ చదివేపిల్లలు నర్సరీ కనీసం 4వక్లాస్ టీచర్స్ నా విష్ చేయరు.టెన్త్ క్లాస్ టీచర్లుతప్ప ఎవరూ కంటికి ఆనరు.ఈమర్యాద బస్సులో కూడా ఇవ్వకపోవడం చూస్తున్నాం.సీనియర్ సిటిజెన్ కి సీటు ఇవ్వకుండా సెల్ లో మాట్లాడే ఆడపిల్లలు ఎక్కువ.మహాభారతంలో ముస్లిం అని హేళన గా మాట్లాడినవారు కర్ణుడు దుర్యోధనుడు.భీష్ముని " ముసలివాడివి మతిలేని వాడివి " అని శూలాల్లాంటి
మాటలన్నాడు.
నిజమైన శిష్యుడు గురువు కి మంచి మర్యాద గౌరవము ఇస్తాడు.కంచి పరమాచార్య ఆరాధన ఉత్సవాలు జరుగుతున్నాయి.అప్పటి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి స్వామి" మానస సంచరరే" అనేపాటవింటూ అలా కంటికిమింటికీ ఏకధాటిగా ఏడ్చారు.తన గురువు గారిని తల్చుకుంటూ! అలాగే
ఎం.ఎస్.సుబ్బలక్ష్మిగారు చాలా పెద్ద వయసులో ఒకచోట సంగీత కచేరీ చేస్తున్నారు.మీరాభజన్స్ హాయిగా పాడుతున్నారు.కానీ ఒక చరణం నోటికి రాక పక్కన తన సహకార గాయని వైపు చూశారు.ఆమెకీ గుర్తు రాలేదు.వాద్యకారులు గుర్తుచేశారు వాయించి.అంతే ఎం.ఎస్.ఠక్కునపాట పూర్తిచేశారు.వయసుతో మర్చిపోయిన కొందరు పెద్దల గ్రహణశక్తి అద్భుతం.ఎవరినీ చిన్న పిల్లలు ఐనాసరే తుస్కరించి హేళన చేయడం మంచిది కాదు.శారీరకశక్తి లేకున్నా వారికి చేయూత నివ్వాలి.
భీష్మ పితామహుడు అంపశయ్య పై ఉన్నప్పుడు
కర్ణుడు ఆయన దగ్గరకి ఎంతో వినయంగా వెళ్లి
మాట్లాడాడు.ఇది మనం నేర్చుకోవాలి
కామెంట్‌లు