కష్టం! అచ్యుతుని రాజ్యశ్రీ

 "ఏంటి ఇంత ఆలస్యంగా క్లాస్ కి వచ్చావు?" టీచర్ అడిగింది." బాగా చలిగా ఉంది టీచర్.అందుకే మా అమ్మ నాన్న కూడా లేవలేదు." క్లాసంతా ఒక్క సారి ఘొల్లుమని నవ్వింది." మేము రాలేదా? మాకు చలిలేదా?" అప్పుడు టీచర్ చెప్పింది ఈవిషయం " పిల్లలూ! మీకు సబ్ మెరైన్ తెలుసుకదూ? అందులో పనిచేసే వారికి సరైన నిద్ర కూడా ఉండదు.సముద్రంలోపల గస్తీ తిరుగుతూ ఉంటుంది.ఆక్సిజన్ లభించక కళ్ళు మండి నానాబాధలు పడ్తారు.గాలికోసం వీలంచూసుకుని  సముద్రం లోనే కాస్త పైకి వచ్చినా వారు అందులోంచి బైటికి రాలేరు.వారు గడ్డం చేసుకోవాలి అన్నా కష్టమే.ఒక వ్యక్తి 47రోజులపైగా సబ్ మెరైన్ లో డ్యూటీ పూర్తి చేసికుని ఇంటికి వచ్చాడు.అప్పటికి అతనికూతురు చనిపోయి 40 రోజులైంది.ఆవిషయం పాపం ఆయన కి తెలీదు.సబ్మెరైన్ నించి బైటపడిన తర్వాత కళ్ళు ఎండని చూడలేవు.కళ్ళు మిరుమిట్లు గొలిపి కన్పడకుండా పోతాయి.మరి పొట్ట తిప్పలు అనండి దేశ భక్తి అనండి వారి తో పోల్చుకుంటే మనం అదృష్ట వంతులంకాదా?" పిల్లలు ఆవిషయం తెలుసుకుని మనదేశం కోసం అనుక్షణం అప్రమత్తంగా ఉండే వారిని తల్చుకుంటూ మనసులోనే వందనాలు అర్పించారు 🌹
కామెంట్‌లు