సుప్రభాత కవిత ; -బృంద
చీకటిని వెలివేసి
వెలుగులను కురిపించి
లేత ఎండలలో వెచ్చని వెన్నెల్లా
హాయిగా మైమరపించే

అంబరపు సంబరం 
అంతరంగాలు మురిపించి
స్వప్నాలు సత్యాలుగా
సాక్షాత్కరించే

హృదయసీమల పరచుకున్న
ఉదయరేఖలు ముదముతో
మదిని మురళిగా మలచి
ఊపిరులూది అలరించే

నింగి లోని నీలమంతా
బంగరు రంగైపోగా
కాంచన కిరణాలు తాకి
పుడమి పుత్తడిలా మెరిపించే

కలిసిన శాఖల మధ్యన
మెరిసే దళాల అంచున
ఆగని వేగపు వెలుగుల
విరిసిన మెరుపుల కిరణం

కన్నుల తాకిన తరుణం
మిన్నులు అందిన భావం
మన్నుల దాగిన సోయగం
వెన్నగ మారి కరిగినట్టు

కనకధారల తడిసిన
అవనికి

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు