రాతిలోని నీరు తాగి
పూత పూయు వింత
నిరాశ కే నిరాశ కలుగు
విజయాల కథ
చెదరని నమ్మకం
బెదరని కష్టం
నిదురని రానీయని
వదలని కోరిక
శ్వాసగా మారిన ఆశ
చేర్చును కోరిన తీరం
అలస్యముంటుందేమో
అంధకారం మాత్రం కాదు
అమూల్యమైన రత్నాలు
అంబుధిలో అడుగునే ఉంటాయి
అందుకునే ఆరాటం
పొందాలనే పోరాటం తప్పదు
విలువలు వీడక
అలుపులు చూడక
కలుపులు రానీక
మలుపులెన్ని తిరిగినా
విజయాలు నీకై
వేచి ఉన్నాయంటూ
దాచిన కలలన్నీ
దోసిట పోసే వేకువకు
🌸🌸 సుప్రభాతం🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి