కైతల భాస్వరం;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కనురెప్పలు తడిపే కవిత్వచాలనంతో
పలుకుబడులభాషతో  
తన కవితావిన్యాసం చేసేవాడు
కత్తిలేకనే నెత్తురు చిందించగల నెరజోడు
రందిలేనిబువ్వ బుక్కపెట్టాలని
తెలంగాణకు మాటలు నేర్పినవాడు
సామాన్యుల బతుకుకోసం
నిలబడి కలెబడి కవిత్వీకరించినవాడు
ముక్కుసూటితనంతో ఎవరినైనా
"ఏమంటవ్?" అని నిలదీసేవాడు
బతుకును బతుకుగా బతుకనిచ్చే 
మహాసందేశకుడు
ఎవరు ఏ భావజాలంతో ఉన్నా
మానవుడిలా ఆలోచించాలనేవాడు
బాహాటంగా తనజీవితమే
కవిత్వంగా చేసుకున్నవాడు
కాలానికే కాదు కాలునికీ 
"జీహుజూర్!"అననివాడు
తెలంగాణ గడ్డమీది విలక్షణ స్వరం
తెలంగాణ పక్షీయుల 
నిరసన రచనలభాస్వరం
తెలంగాణ యాస భాష లను
జెండాకెత్తిన కైతల కాళోజీ
నీకు నీవే సాటి గురూజీ !!!
**************************************


కామెంట్‌లు