ధైర్యే సాహసే లక్ష్మి...సి.హెచ్.ప్రతాప్

 సుఖ దుఖములు కాలచక్రం లో సహజం
కంటి రెప్పలు వాల్చి తెరచినంత
సహజం గా వచ్చిపోయేవే
అన్ని వేళలా పూలపాంపుపై  
సుఖ శయనం సాధ్యమా ?
ఉత్ధాన పతనములు ప్రకృతి సహజం
ఎన్ని విషమ పరిస్థితులనే
విష సర్పాలు కాటు వేస్తున్నా
ధైర్యంగా బ్రతుకును గడిపేవారికే
జీవనం ఇస్తుంది సుస్వాగతం
తన గురించి అతి జాగ్రత్త వహించేవారికి
అడుగడుగునా అపాయాలే స్వాగం ఇస్తాయి
గౌరవం, అభిమానం పోతాయని
భయపడుతూ ఉండేవారికి అవమానమే ప్రాప్తం
ఏదో పోతుందని భయపడేవారు
ఎప్పుడూ నష్టపోతారు.
భయం ప్రమాద హేతువు
ధైర్యమే మనకు శ్రీ రామరక్ష
యువకులై, ఉత్సాహవంతులై,
బుద్ధిమంతులై, ధీరులై
మృత్యువును సైతం పరిహసించగలిగి,
సముద్రాన్నైనా ఎదురీదడానికి
సంసిద్ధులై ముందుకు సాగుదాం 
కామెంట్‌లు