పౌర సేవల చట్టం -సి.హెచ్.ప్రతాప్

 అన్నాహజారే జన లోక్ పాల్ బిల్లు కోసం ఆందోళన చెసిన నేపధ్యం లో కేంద్ర ప్రభుత్వం సిటిజెన్ చార్టర్ అండ్ ఫిర్యాదు /పరిహారం 2011 బిల్లు ముసాయిదాను పార్లమెంటులో ప్రవేశపెట్టి అమోదింపజేసింది. సదరు  బిల్లు ద్వారా ప్రతి పౌరుడికి నిర్దిష్ట వస్తువులు మరియు సేవల యొక్క సమయ-సరిహద్దు పంపిణీకి హక్కును ఇవ్వడానికి మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం ఒక యంత్రాంగం అందించడానికి ప్రయత్నిస్తుంది. చట్టం అమలులో ఆరు నెలల వ్యవధిలో పౌరసత్వ చార్టర్ను ప్రచురించడానికి ప్రతి పబ్లిక్ అధికారం కోసం బిల్లు తప్పనిసరి చేస్తుంది, ఆ అధికారి సంబంధిత చర్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది, దీనితో రూ. 50,000 తన జీతం మరియు క్రమశిక్షణా చర్యలు ఎదుర్కోవలిసి వుంటుంది. అయితే ఈ బిల్లు కూడా ఏనాడూ కార్యరూపం దాల్చలేదు. ప్రభుత్వోద్యోగుల ఒత్తిడి కారణం గానే ప్రభుత్వం ఈ ముసాయిదా బిల్లును బుట్టదాఖలు చేసిందనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు  పౌర సేవల చట్టం రూపకల్పనను ఒక వ్యక్తిగత విషయం గా కాకుండా మెరుగైన వ్యవస్థ నిర్మాణం కోసం జరుగుతున్న ప్రయత్నం గా భావించి తమ వంతు తోడ్పటు అందించాలి. ప్రభుత్వం ప్రజల కోసం ఎన్ని పధకాలు ప్రవేశపెట్టినా,అంతిమం గా ప్రజలు ధీమాగా, ధైర్యం గా ప్రభుత్వ కార్యాలయాల లోనికి వెళ్ళి ,అవినీతి, అక్రమాలు, వేధింపులకు ఆస్కారం లేకుండా న్యాయపరమైన సేవలను పొందలేకపోతే అది ఒక వృధా ప్రయాస అని భావించాలి. అందుకే ప్రజలందరికీ ఎలాంటి తారతమ్య బేధాలు లేకుండా మెరుగైన ప్రభుత్వ సేవలు లభించేందుకు పౌర సేవల చట్టం తీసుకురావడం ఎంతో అవసరం. జాతీయ పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 21న దేశవ్యాప్తంగా ప్రతి ఏటా నిర్వహిస్తారు.[1][2] భారతదేశంలోని ప్రజలందరికి ఇల్లు, ఆహారం, ఆరోగ్యం, విద్య అందించే ముఖ్య లక్ష్యంతో ఈ దినోత్సవం జరుపబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, తద్వారా ప్రజలు వారివారి ప్రాథమిక హక్కులను పొందేలా చూడాలన్న ఉద్దేశ్యంతో జాతీయ పౌర సేవల సంస్థ 2016, ఏప్రిల్ 21 ఈ పౌర సేవల దినోత్సవాన్ని ప్రారంభించింది.
కామెంట్‌లు