శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
176)మహా ద్యుతిః -

జ్యోతి స్వరూపియైనట్టి వాడు
బాహ్యంతరములలో వ్యాపకుడు
తేజముగలిగియున్నట్టి వాడు
ప్రకాశముగా కనిపించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
177)అనిర్దేశ్యవపుః -

ఇలాగ అని చెప్పలేనివాడు
రూపమును పోల్చలేనివాడు
స్వ సంవేద్యునిగా నున్నవాడు
శక్యం గానట్టి వాడైయున్నాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
178)శ్రీమాన్ః -

గొప్ప ఐశ్వర్యవంతుడైనవాడు
సంపదలతో వెలుగువాడు
సంపన్నవంతునిగానున్నవాడు
శ్రీలు తనయండున్నట్టి వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
179)అమేయాత్మాః -

ఊహకు అందనివిధమైనవాడు
అంచనా వేయలేనట్టివాడు
అమేయమైన శక్తియున్నవాడు
అపురూపమైన గురుదేవుడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
180)మహాద్రిధృక్ః -

పర్వతాలను ధరించినవాడు
గిరిధారిగా నిలిచినవాడు
మందరపర్వతమెత్తినవాడు
గోవర్ధనము నిలిపినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు