‌‌ వత్తి!!!- ప్రతాప్ కౌటిళ్యా
గుప్పిట్లో గుండే
వేళ్ళ సందుల్లోంచి జారిపోతుంది!
పెదాల మధ్య చిరునవ్వు
చందమామలా తొంగి చూస్తుంది!!

ఉప్పొంగే సముద్రం కళ్ళ తీరంలో
కెరటంలా రెప్పల్ని ముద్దాడుపోతుందీ!!!
మాటల స్వరపేటికలో శతాబ్దాల శబ్దాలు
మనసు పడి బయటపడుతున్నవీ!!!

ఆకలి గొన్న ఎదురుచూపులు
తాళం తీసి తనువునంత తడిమి చూసి
కడుపు నింపుకున్నవీ!!
చావు బతుకుల మధ్య
చిగురించిన చిలిపితనం చివరి వరకు
ఆశను ప్రేమిస్తుంది!!!

పసిపిల్లల ఆటల మధ్య పడుచు జంటల కోలాటం
పర్వం కోసం పరువు పోయిన పర్వాలేదందీ
కన్ను కుట్టితే వచ్చే జ్వరం
అనురాగం రోగం కుదురుస్తుందని
మనసు పడింది మనసు వెంట!!!

విజ్ఞానాన్ని జయించిన ప్రేమ
తలస్నానం చేసి నల్లని కురులారబోస్తే
సూర్యునికి చలి జ్వరం వచ్చి కప్పుకున్నాడు
నారదుడు ముల్లోకాల్లో నడుస్తుంటే
కలహాలు వెండి బంగారు లోహాల్లా
అమ్ముడుపోతున్నవి!!!!!!!

విని దాచుకున్న రహస్యం మూడొందల అరవై డిగ్రీ ల్లో నాలుకను ప్రేమిస్తుంది!!!

పరిమళాల పెళ్లిచూపులు
సరిగమల సంగీత ధ్వనులు
అంతులేని ఆనందం గొంతు చివరి మాట
ఒక ప్రేమ పాఠం!!!!

ఎగిరి పడుతున్న చేపలు నదికి ఎదురీదినట్లు
మధుల మధ్య ఎన్నెన్నో నదులు పడుతున్నాయి.!!!

పిలుపుల మధ్య వలపులు
వివాహమాడినట్లు
స్వర్గం తలుపులు తెరిచింది!!

గుర్తించిన ముఖాలు
గుండెల్లోనే దాక్కుంటాయి గుడిలోని దీపాల్లా!!

కరిగిపోతున్నది ఒత్తి కాదు క్రొవ్వొత్తి
ఒత్తిడి కూడా అంతే!!!!?

ప్రతాప్ కౌటిళ్యా 🙏

కామెంట్‌లు