హిడింబి! అచ్యుతుని రాజ్యశ్రీ

 సాధారణంగా బాగా భారీ కాయం వారిని చూడగానే బాబోయ్! హిడింబాసురుడు భీముడు ఘటోత్కచుని లా ఉన్నాడంటాం.అలాగే స్త్రీ నా తాటకి హిడింబి అంటాం.మహాభారతంలో అతిమంచితనం పరోపకారబుద్ధి ఉన్న రాక్షసస్త్రీ హిడింబి.భీముడిని చంపాలని వచ్చి అతన్ని చూసి పెళ్లి చేసుకుతీరాలని  నిశ్చయించుకుంది.అందంగా తన రూపాన్ని మార్చుకుంది.అన్నని భీముడు చంపితే కుయ్ కయ్ అనలేదు.కుంతీదేవి ధర్మరాజు తో ఎంతో వినయ విధేయతలతో మాట్లాడి వారి మనసు గెలిచింది.అలా కుంతి కి మొట్టమొదటి సారిగా కోడలుగా ఆఇంట కాలుపెట్టింది.ఎక్కువతక్కువ మాట్లాడే స్వభావం కాదు ఆమెది.సమయసందర్భంని బట్టి మాట్లాడి ధర్మరాజు మన్ననలు పొందింది." నాకు భూత భవిష్యత్ వర్తమాన విషయాలు తెలుస్తాయి.మీ ఆరుగురుని తేలికగా ఎక్కడికి కావాలంటే అక్కడికి మోసుకుంటూ పోగలను.వ్యాసుడు వచ్చి మీకు సలహా ఇచ్చే దాకా శాలిహోత్రుని ఆశ్రమం లో ఉండండి.నేను భీముడు ఇక్కడ హాయిగా ఓఏడాది కాలక్షేపం చేస్తాం.మాకు ఓపిల్లాడు పుట్టాక నాభర్త భీముడిని మీదగ్గరకి పంపిస్తాను.నాకొడుకుని నేనే పెంచి పెద్ద చేసి వీరుడిగా మీకు అప్పగిస్తాను" అని కుంతి పాండవులని ఒప్పించింది.ధర్మరాజు అలా ఆమె మాటలు విన్నాడు.ఆమె కొడుకు ఘటోత్కచుడు.మాయాబజారు సినిమాలో మనల్ని అలరించిన వివాహ భోజనంబు వింతైన వంటకంబులు అని అలరించిన వాడు 🌹
కామెంట్‌లు