రాక్షసులు;- - డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 ఎసలారు కీర్తిచంద్రికల నుగ్గడించుకొని
సహదేశ భావనను కాలరాచి
గజరాజు వీపున తిరిగి తిరిగి
చేవలేదని భావించి
ఘనకీర్తి వెలిగిన భరతభూమిని
అరుణచల ప్రాంతమును మ్రింగు చైనీ
యులు రాక్షసాధములై వ్యవహరిస్తే
సకాలమున భారతి స్పందిస్తే
ఇక "మమ్ముకాపాడు వారెవరా" యని
మీరు దిరుగ
ఏడులోకాల గమ్యమేది మీకు? !! 

{ఎసలారు=అతిశయించిన;ఉగ్గడించుకొని=స్తుతించుకొని}
**************************************


కామెంట్‌లు