ధర్మ సూక్ష్మం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మహాభారతంలో అద్భుతమైన వ్యక్తి ధర్మరాజు.ఎన్నో చిక్కుప్రశ్నలకు జవాబులు ఇచ్చి తన తమ్ముళ్ళను కాపాడుకున్న ధర్మాత్ముడు.కానీ మనం ఎక్కువగా అర్జునుడు భీముడు వారి పరాక్రమము గూర్చి చెప్పి హీరో వర్షిప్ ఆరాధనా భావం మనసులో నింపుకుంటాం.కానీ ధర్మం నీ పట్టుకుని మెత్తని పులిలాగ ప్రవర్తించిన ఆదర్శం యుధిష్ఠిరుడు.ఎవరితో ఎలా లౌక్యంగా మాట్లాడాలో తెల్సినవాడు.ధర్మరాజు స్వయంగా ద్రుపదుని తో అన్నాడు " నాతమ్ముడు మత్స్య యంత్రం ఛేదించాడు. కానీ నీకూతురు ద్రౌపదిని మేం 
 ఐదుగురు పెళ్లి చేసుకుంటాం.ఆమె మాకు అండదండలు శక్తి నిస్తుంది." హాస్యం కైనా నాలోనే కాదు మాతమ్ముళ్లలో కూడా అధర్మం పుటమరించదు.వ్యాసులవారు దగ్గర ఉండి వారి పెళ్లి ద్రౌపది తో చేయించాడు.యువరాజైన ధర్మరాజు ఖాండవప్రస్థం కి రాజైనాడు.అన్నిటిలో పరమాత్మని దర్శించే మానవతను ఐక్యమత్యాన్ని చూపాడు.అవసరమైతే పోరాడుతాడు. దొంగలు పేట్రేగిపోయే స్థితి లో పోలీసులు దండప్రయోగం శిక్ష కఠినంగా అమలు పరచాలి.తోటి సాటి మనిషి అని అత్యాచారం చేసేవారిని కఠినంగానే శిక్షిస్తే ఇన్ని అత్యాచారాలు జరగవు.కోర్టులో పెండింగ్ కేసులు ఉండవు.కుడి ఎడమచేత్తో వేర్వేరు పనులు చేస్తాం.కానీ అవి కొట్టుకోవు.చప్పట్లు చరచటం సంతోషం వ్యాయామం కి మార్గం.అలాగే రోడ్డు పై ప్రమాదం జరిగింది.నాకెందుకు వానప్రస్థం లో ఉన్న అని తప్పించుకోరాదు.అశోకవనంలో సీత రాక్షస స్త్రీలతో అంది" ఆకోతి సంగతి నాకేం తెలుసు?" అని.ఆమెకు తెల్సు వచ్చినవాడు హనుమంతుడు తనజాడ తెల్సుకోటం కోసం ఆయన వచ్చాడని.కానీ నాకు తెలీదు అని చెప్పింది.అబద్ధం కాదు.ఇదీ ధర్మం సూక్ష్మం 🌷
కామెంట్‌లు