కాసాబియాంకా! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఫ్రెంచ్ చక్రవర్తి నెపోలియన్ బోనాపార్టే మంచి యోధుడు.చరిత్రలో ప్రసిద్ధుడు.ఇటలీపై యుద్ధం కి బైలుదేరాడు. ఆతర్వాత ఆసియా ఖండం లో తన పెత్తనం నెలకొల్పాలని నైలు నది యుద్ధం పేరు తో చరిత్ర సృష్టించాడు.ఓరియంట్ అనే యుద్ధ నౌక కెప్టెన్ తన పదేళ్ళ కొడుకు కాసాబియాంకా ను నౌకలోనే ఉంచి తాను యుద్ధం పనుల్లో మునిగాడు.ఆంగ్లేయుల తూటాలు ఫిరంగి తో చిన్నారి ఉన్న నౌకకు నిప్పు అంటుకుంది.ఎంతోమంది ఫ్రెంచ్ వారి తో పాటు కెప్టెన్ కూడా చనిపోయాడు.మన చిన్నారిని కాపాడాలని చిన్న పడవలో బాబు ని తీసుకుని వెళ్లాలని వచ్చిన వారితో" మానాన్న ఇక్కడే కదలకుండా కూచో అన్నాడు.మానాన్న వచ్చి చెప్తే కానీ నేను మీతో రాను" అని తెగేసి చెప్పాడు." నాన్నా! ఎక్కడ ఉన్నావు? నన్ను పడవలో తీసుకుని వేరే సురక్షితంగా ఉన్న చోటు కి తీసుకొని వెల్తారుట.నాన్నా!" అని ఆపసివాడు మంటల్లో ఆహుతి ఐనాడు.ఈహృదయవిదారక సంఘటనను ఆంగ్ల కవయిత్రి మిసెస్ హెమన్స్ తన కవితలో వర్ణించారు.ఆబాలుడి పితృభక్తి  అతని అంతఃకరణ అత్యంత ప్రతిష్టాత్మకం శ్రేష్ఠంఅని ఆకవితలో ఉంది.నిజంగా అది చదివితే కళ్ళ నుండి నీరు జలజలరాలుతాయి. యథార్థ సంఘటనలే ఆనాటి రచనల్లో ఉండేవి.చరిత్రకు సాక్షి గా నేడు కూడా నిలిచాయి.ఊహాలోకంలో విహరించినా కవి వాస్తవానికి దర్పణం లా కవిత అల్లితే సమాచారం అందిస్తే చరిత్ర లో శాశ్వతం గా ఉండిపోతుంది 🌹
కామెంట్‌లు