156)ఊర్జితః -
అతి బలవంతుడైనవాడు
సర్వశక్తులు కూడినవాడు
మహాబలమునీయగలవాడు
ధృడమైనట్టి మూలమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
157)అతీoద్రః -
ఇంద్రుని అతిక్రమించినవాడు
దేవేంద్రుని కంటే ఘనుడు
దేవతలు కొలుచుచున్నవాడు
అధిష్టానము నందున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
158)సంగ్రహః -
అన్నియు సంగ్రహించువాడు
ప్రళయమున రక్షించువాడు
సూక్ష్మరూపము చేయగలవాడు
భక్తులనొకచోట చేర్చువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
159)సర్గః -
సృష్టియే తానుగా మారినవాడు
సకలమూ తనవైనట్టివాడు
కారణముగా నిలుచున్నవాడు
బాధ్యతతాను భరించువాడు
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
160)ధృతాత్మా-
తనపైతాను ఆధారపడేవాడు
ధృతిని కలిగించగలవాడు
ఆదరముగా చూడగలవాడు
ఆశ్రయము నీయగలవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి