'హరీ!'శతకపద్యాలు.;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర.
 9.
చంపకమాల.
సురలకునీయనా సుధను సొంపగురూపము దాల్చితీవు నిన్
వరదుడటంచు మ్రొక్కిరట పంచముఖుండు విధాతయున్ పరా
త్పరుడవు జీవశక్తినిడి పాలన చేసెడి లోకపోషకా!
పరమపథంబు జూపగదె!పాహి!యటంచును గొల్చెదన్ హరీ!//
10.
చంపకమాల.
నెఱవుగ నిందిరన్ హృదిని నిల్పితివే సరిజోడువంచు నీ
మురిపెము దీర నాడుచును బుణ్యము లిత్తువు గోకులంబుకున్
సరగున మౌనివర్యులకు సద్గతులన్నియు జూపువాడ!నీ
చరణపు ధూళి రేణువుగ శాశ్వతమౌగతి నీయవో హరీ!//

కామెంట్‌లు