సౌందర్యలహరి ; - కొప్పరపు తాయారు
 🌻 శ్రీ శంకరాచార్య విరచిత🌻

విశుద్ధౌ తే శుద్ధస్ఫటికవిశదం వ్యోమజనకం
శివం సేవే దేవీమపి శివసమానవ్యవసితామ్ ।
యయోః కాంత్యా యాంత్యాః శశికిరణసారూప్యసరణే-
విధూతాంతర్ధ్వాంతా విలసతి చకోరీవ జగతీ ॥ 37

సమున్మీలత్ సంవిత్ కమలమకరందైకరసికం
భజే హంసద్వంద్వం కిమపి మహతాం మానసచరమ్ 
యదాలాపాదష్టాదశగుణితవిద్యాపరిణతి-
ర్యదాదత్తే దోషాద్ గుణమఖిలమద్భ్యః పయ ఇవ38
37)
      తల్లీ!నీ విశుద్ధ చక్ర మందు స్పటిక మణివలె
నిర్మలమైన ఆకాశ జనకమగు  శివతత్వమును అట్టిది యగు దేవీతత్వమును సేవించెదను. వెలుగుచున్న ఏళివ్వాళిపులయొక్క 
వెన్నెలను బోలు కాంతి చేత లోకము నశించిన యజ్ఞానము గలవాడై చేకోర పక్షివోలే ఆనందించు చున్నదో.
38) తల్లీ! ఏం మిథునం పలికిన పలుకులన్నియు అష్టాదశ విద్యలుగా మారుచున్నవో ఏ జంట దోషముల నుండి గుణమును నీటి నుండి పాలను వలె గ్రహించు నో, వికసించిన జ్ఞానమనెడి కమలమందలి మకరందములో గ్రోలి మైమరచి ఉన్న శివ శివాత్మకమనెడు, హంశ మిధునమును నే
సేవింతును.
                  ****🪷*****
 తాయారు 🪷

కామెంట్‌లు