యువతా మేలుకో;- ఉండ్రాల రాజేశం -రచయిత
 "సోదర సోదరీమణులారా" అంటూ
హిందూ మత ప్రాశస్త్యం ప్రస్తావించి
యోగ, వేదాంతాలను ఉపన్యసించి
ప్రాశ్చాత్య దేశాలను జాగృత పరిచిన
విజ్ఞాన భాండగారం నరేంద్రుడు
ఇనుప కండరాలు, ఉక్కు నరాల యువతతో
సువర్ణ భారతం నిర్మిస్తానన్న మాటలకు
యువ సింధూరాలను మేల్కొల్పి
ఆసేతు హిమాచలంను ముచ్చటింపజేసిన
హిందూ మత కీర్తి బాహుట వివేకానందుడు
నేటి యువతకు మీరే ఆదర్శం
మీ మాటలు జగతికి సర్వస్వం
నరేంద్రుల బాటలోనే మనందరి పయనం


కామెంట్‌లు