శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )- ఎం. వి. ఉమాదేవి
36)ఈశ్వరః -

సర్వులను పాలించునట్టివాడు
సకలాధిపత్యము పొందినవాడు
ఇచ్ఛామాత్రముగ నుండువాడు
అతీతుడై చరించెడివాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
37)స్వయంభూః -

స్వయంగా జన్మించినవాడు
ఇచ్ఛానుసారం ప్రభవించువాడు
ఎట్టి ఆధారాలు లేనివాడు
స్వామి తనకుతానైనవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు!ఉమా!
38)శంభుః -

శుభముల ప్రసాదించువాడు
సుఖజీవితము నొసగువాడు
సంతోషమునందించు వాడు
సుఖములకు కారణమైన వాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
39)ఆదిత్యః -

సూర్య మండలప్రకాశకుండు
అదితి కుమారుడైన వామనుడు
స్వర్ణకాంతి ప్రకాశకుడు
విష్ణువను పేరుగల్గినవాడు 
శ్రీ విష్ణు సహస్ర నామాలు ఉమా!
40)పుష్కరాక్షః -

తామరపూల కన్నులు గలవాడు
పద్మనేత్రములభాసించువాడు
పద్మ సంభవునికి జనకుడు 
పద్మాక్షి లక్ష్మిని ధరించినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!

కామెంట్‌లు