తిరుప్పావై ; - కొప్పరపు తాయారు
  🌻27,వపాశురం🌻
 కూడారై వెల్లుమ్  శీర్ గోవిన్ద ఉన్దన్నై  పాడిపట్టై   కొణ్ణుయామ్ పెఱు  తెమ్మానమ్ నాడు పుగళుమ్ 
పరశినాల్  నాగ చ్చూడగమే  తోళ్
వెళ్తేయే,తోడే శెప్పూవే ! పాడగమే ,యన్రునైయ 
పల్కలనుమ్  యా మణివోమ్  ఆడై 
యుడుప్పోమ్,  అదన్  పిన్నే పాల్,శోఱు,
మూడ నెయ్  పెయ్  దు ముళి దైవాళి 
వారి కూడి యిరున్దు కుళిర్  న్దేలో 
రెమ్బావాయ్
    
 వారి మనసులను మార్చి నీకు దాసులైనట్లు చేసి విజయాన్ని సాధించగల ధీమంతుడా ! ఓ గోవిందా! 
నిన్ను స్తుతించి నీ నుండి 'పఱ' అనువాద్యాన్ని పొంది లోకులచే సన్మానింప బడ లేనని మా కోరిక నీ అనుగ్రహానికి పాత్రులమైన మమ్ము లోకమంతా పొగడాలి. మేము పొందు సన్మానము లోకులందరూ పొగుడున్నట్లు ఉండాలి ఆనాటి మా రూపాలు ప్రకాశవంతంగా తేజోమయంగా వవిరాజిల్లుతూ ఉండాలి. దానికై మాకు కొన్ని భూషణాలు కావాలి. ముంజేతులకు కంకణాలు కావాలి.
     భుజముల నాలంకరించుకొనుటకు   భుజకీర్తులు
కావాలి. దండలకు తొడవులు ను ఇంకా ఎన్నో ఆభూషణములు నీ వనుగ్ర హించగా మేము ధరించాలి ధరించాలి. సన్మానమొందాలి. వీటన్నింటి ధరించి ఆపై మేలిమి చీరలను కట్టుకోవాలి. అటు పై క్షీరాన్నము ములుగునట్లు పోసి నా నెయ్యి మోచేతి గుండా కారుతుండగా మేమంతా నీతో కలసి చక్కగా ఆరగించాలి ఇది మా కోరిక ఇట్లైనా మా వ్రతము మంగళ ప్రదమైనట్లే
🪷******🪷***🪷

కామెంట్‌లు