'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.- పూణే. మహారాష్ట్ర.
 17.
చంపకమాల.
అనుపమ శీలమున్ గలిగి యద్భుత వీరపరాక్రమంబుతోన్
ఘనతర కార్యముల్ సలిపి కాలముఁ ద్రిప్పుచు విశ్వరూపిగన్
మునుకొని సజ్జనాత్ములకు ముక్తినొసంగుచు నేలువాడ!నా
మనమున గొల్వు సేయవయ!మంగళదాయక! ప్రేమగన్ హరీ!//

18.
ఉత్పలమాల.
సంపద సౌఖ్యముల్ బడసి సద్గుణ మించుక లేకపోయి బల్
తెంపరులైన మానవులు త్రెళ్లుచు నుండగ ధర్మరాట్టు తా
నంపగ దూతలన్ జడిసి యార్తిగ కేకలు పెట్టుచుంద్రు నిన్
బెంపుగ దల్చగన్ దొలగు వేదన లన్నియు నీ దయన్ హరీ!//

కామెంట్‌లు