'హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 15.
ఉత్పలమాల.
దుష్టులఁ రాక్షసాధముల దోర్చగ వచ్చిన వాడవై సదా
శిష్టుల బ్రోచుచుండ నిను చిత్తము నందు తలంచు వారికిన్
గష్టము లన్నియున్ దొలఁగు కామిత మెల్లను దీరిపోవుతన్
దుష్టినొసంగు కృష్ణ!నిను దోసిలి యొగ్గి నుతింతు శ్రీహరీ!/ 
16.
ఉత్పలమాల.
శుద్ధమనంబునన్ బిలువ జూపెద వయ్య !కటాక్షమెంతయో!
శ్రద్ధగ నీదు సేవలను సంతసమొందుచు సల్పుచుండ స
ద్బుద్ధిని కల్గ జేయగదె!
పుణ్యము పొందగ నీదు పూజలన్
బద్ధులమై నిరంతరము భక్తిగ జేయుదు మయ్య శ్రీహరీ !//

కామెంట్‌లు