తిరుప్పావై ; వరలక్ష్మి యనమండ్ర
 23 వ పాశురం..
**********
మారి మలై మురైంజిల్ మన్ని క్కిడందుఱంగుం శీరియ శింగం అరివుత్తు తీవిరిత్తు వేరి మయర్ పొంగ ఎప్పాడుం పేరుందుదఱి మూరి నిమిరుందు మురంగి ప్పుఱప్పట్టు పోదరుమా పోలే నీ పూవైప్పూ వణ్ణా ఉన్ కోయిల్ నిన్జు-ఇంగనే పోందరిళి క్కోప్పుడైయ శీరియ శింగాశనత్తిరుందు యాం వంద కారియం ఆరాయ్-అందరుళ్-ఏలోర్ ఎమ్బావాయ్
***********
భావము..పంచపదులలో......
***********

గోదాదేవి,గోపికలతో కూడి మేల్కొలపగా శ్రీకృష్ణుడు నిదుర లేచుట)
అతసీ పుష్ప రూపము గల కన్నయ్యా
గుహలోని సింహమోలె నీవున్నావయ్యా
నిద్రించు సింహం లేచినట్లుగా లేవవయ్యా
నరసింహుని వలెను నడచి రావాలయ్యా 
సింహాసనమును అధిష్టించుమా కన్నయ్యా...కృష్ణా

గోపికలందరు కూడితిరి
ఆండాళ్ తల్లితో వచ్చితిరి
కృష్ణుని వారు మేల్కొల్పితిరి
విన్నపములను వినమనిరి
కృష్ణుని గద్దె అధిష్టించమనిరి... కృష్ణా!
**********

కామెంట్‌లు