'హరీ!'శతకపద్యాలు ;- టి. వి. యెల్. గాయత్రి.-పూణే. మహారాష్ట్ర
 3.
చంపకమాల.
ఎలమిని నారదాదులట నింపుగ సన్నుతి చేయుచుండగన్
బలువగు దేవతాళి కడు భక్తిగ  మ్రొక్కగ నీదు పాదముల్ 
జిలుకుచు మందహాసమును శ్రీకర మొప్పగ బ్రోచువాడ నే 
దలచెద నీ కృపన్ మిగుల తన్మయ మొందుచు నెమ్మదిన్ హరీ!//

4.
చంపకమాల.
గరుడుని మూపుపై జనుచు గ్రక్కున భక్తుల బ్రోచువాడవై
దరిగొని వాంఛ తీర్తువట 'త్రాహి!'యటన్న కృపాళువై వెసన్
గరుణరసాత్మకుండవట!కల్పిత గాథలు కావుకావు! నీ
చరితములన్నియున్ వినుచు సత్యములంచును నమ్మితిన్ హరీ!//

కామెంట్‌లు