తిరుప్పావై; - కొప్పరపు తాయారు
    🌻21వ, పాశురం 🌻
 ఏం పొంగి  మీదళీప్ప మాట్రాదే  పాల్ శొరియుమ్
  వళ్ళల్  పెరుమ్ పశుక్కల్ ఆట్ర  పడైత్తాన్ మగనే !
  యరివురాయ్  ఊట్రముడై  యాయ్ !
   పెరియాయ్ !ఉలగినిల్  తోట్రమాయ్ నిన్ర  శుడరే !
   తుయిలెళాయ్ మాట్రారు నక్కు  వలితు  లైను 
   ఉన్ వా శర్కణే అటాడు వన్దోమ్  న్టు  ఏదో 
    రెమ్బావాయ్
పాలను  పిదుకుటకై  పొదుగల కింద  ఎన్ని భాఝడములు ఉంచినను అవన్నీ యు పొంగి పొరలి పోవునట్లు క్షీర ధారలను వర్షించే ఓ సంపద గోసంపద కలిగిన శ్రీ నందగోపుని కుమారుడవైన
ఓ శ్రీ కృష్ణా ! మేల్కొని మమ్ముఆత్న కనరా రావయ్యా!
అప్రతిహత ధైర్య సాహసాములను కలిగియును 
ఆశ్రిత పక్షపాతివై, సత్పురుషులకును, ఆత్మ స్వరూపుడవైన నీవు యీ భూ లోకమునందు అవతరించిన ఉజ్వల రత్నదీపమా ! వేద ప్రమాణ
ప్రసిధ్ధుడా !ఆ వేదముచేతనైనను ఎరుక పడనంతటి
మహా మహిమాన్వితుడా! ఈ దీనుల కటాక్షించి మేలు కొనుము.శత్తులెల్లరు నీ పరాక్రమము నకు 
నీ వాకిట నిలచి నిన్ను శరణు జొచ్ఛిన  రీతిని మేమందరమూ అనన్య ప్రయోజకులమై 'నీవే
తప్ప ఇతః పరం బెరుగ' మని నీ పాదాను దా‌సులమై
వచ్చితిమి.
         నీ దాసులమైన మేమందరమును నీ దివ్య కళ్యాణ గుణ సంకీర్తనము చేయగా వచ్చినాము నీ దివ్య మంగళ విగ్రహము నకు దివ్య మంగళా శాసనము చేయ నిలిచినాము స్వామి ! నిన్నాశ్రయించి  వచ్చిన మమ్ము కరుణించుటకు మేలుకొను స్వామీ ! లేచి రావయ్యా ! అని వేడుకుంటున్నారు.
 🪷****🪷****🪷

కామెంట్‌లు