ప్రణాళిక;- - జె.నిర్మల-తెలుగు భాషోపాధ్యాయురాలు-జ.ప.ఉ.పా.రామంచ-సిద్ధిపేట
 ప్రణాళిక లేని జీవితం
పగిలిన అద్దం లాంటిది..
ప్రసిధ్ధి చెందడానికైన...
పతనం పొందడానికై...
కారణం  ప్రణాళికే
నియమ నిబంధనలు లేని..
జీవితం 
నీటిలో వ్రాతలాంటిది
గాలిపటానికి ఆధారం- దారం
మనిషి మనుగడకు ఆధారం
ప్రణాళిక..
జీవిత లక్ష్యసాధనకు..
రూపకల్పనే ప్రణాళిక...
మహోన్నతమైన వ్యక్తులుగా...
రూపుదిద్దు కోవాలంటే...
పాటించక తప్పదు ప్రణాళిక..
వ్యక్తికైన, వ్యవస్థకైన,సంస్థకైన 
ప్రణాళిక ఉంటేనే ప్రకాశింపబడుతంది.

కామెంట్‌లు