కుదమ గ్రామ సంబరాల్లో కుదమకు బహుమతి

 పాలకొండ మండలం వోని పాఠశాల ఉపాధ్యాయులు కుదమ తిరుమలరావు, తన సొంతూరు కుదమ గ్రామంలో సంక్రాంతి సంబరాల పోటీల్లో పాల్గొని విజేతగా నిలిచారు. కుదమ సంక్రాంతి సంబరాల కమిటీ సభ్యులు భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ రోజుల్లో పెద్ద ఎత్తున నిర్వహించిన పలు పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానోత్సవం నిర్వహించారు. కుదమ శ్రీరామమందిరంపై నిర్వహించిన ఈ ముగింపు సభలో హౌసీ పోటీల్లో విజేతగా నిలిచిన కుదమ తిరుమలరావుకు బహుమతిని అందజేసారు. 
బహుమతి గ్రహీత కుదమ తిరుమలరావు మాట్లాడుతూ పుట్టినూరు కన్నతల్లితో సమానమని ఈ బహుమతి వెలకట్టలేని ప్రేమానురాగాల ఆత్మీయమని అన్నారు.
సొంతూరు కుదమ గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించిన  గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, విద్యావంతులంతా 
పండక్కి వచ్చిన బంధుగణమంతటికీ మిక్కిలి వినోదభరితమైన వైభవాన్ని సాక్షాత్కరింపజేసారని,
నిర్వాహకుల కృషి బహుప్రశంసనీయమని తిరుమలరావు అభినందించారు. 
ప్రతీ పోటీకీ రెండు వందలమందికి పైగా పాల్గొనేలా స్పందననిచ్చిన ఈ పోటీల వ్యూహకర్తలకు, న్యాయనిర్ణేతలకు, విరాళదాతలకు, కుదమ సంక్రాంతి సంబరాల కమిటీ సభ్యులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 
హౌసీ, స్పూన్ లెమన్, మ్యూజికల్ చైర్, బాస్కెట్ లో బాల్, స్లో సైకిల్ డ్రైవింగ్ పోటీ, గోనెలో కాళ్ళుంచే పరుగుపోటీ, ముగ్గులపోటీ, ప్రతిభా పోటీలతో పాటు, గాలిపటాల ఎగురవేత, ఆటాపాటా కార్యక్రమాలలో పాల్గొన్న బాలలు, విద్యార్థులు, యువకులంతా ఈ పోటీల స్ఫూర్తితో మరింత ప్రతిభావంతులవ్వాలని తిరుమలరావు పిలుపునిచ్చారు.
జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత కుదమ తిరుమలరావు ఆలపించిన సంక్రాంతి గీతాలు అందరినీ అలరించాయి.
కామెంట్‌లు