సౌదీ అరేబియాలో చిగురుమళ్ళ శ్రీనివాస్ మధ్య ప్రాచ్య దేశాల శాంతియాత్ర


 సౌదీ అరేబియాలోని దమ్మామ్ నగరంలో చిగురుమళ్ళ శ్రీనివాస్ నిర్వహిస్తున్న మధ్య ప్రాచ్య దేశాల శాంతి సద్భావనా యాత్ర ఘనంగా ప్రారంభమైంది. సౌదీ అరేబియా తెలుగు సమాఖ్య (SATS) ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వేలాదిమంది ప్రవాస తెలుగువారు పాల్గొన్నారు.SATS అధ్యక్షులు నాగశేఖర్ చందగాని మాట్లాడుతూ ప్రపంచ మానవాళికి శాంతి సందేశాన్ని అందించడానికి, విశ్వ మానవ సౌభ్రాతృత్వాన్ని చాటటానికి సాహిత్యం ద్వారా సామాజిక చైతన్య కలిగించడానికి  శ్రీనివాస్ గారు వంద దేశాల యాత్ర నిర్వహించటం అభినందనీయమని అన్నారు. 
చిగురుమళ్ళ మాట్లాడుతూ తానా 100 దేశాలలో ఉన్న వందకు పైగా తెలుగు సంఘాల సమన్వయంతో తానా అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు, వందేవిశ్వ మాతరమ్ చైర్మన్ 
జయశేఖర్ తాళ్ళూరి సారథ్యంలో ఈ బృహత్ అక్షర యజ్ఞం జరుగుతోంది. 
నవంబర్ తొమ్మిదో తారీఖున బోట్స్ వానాలో ప్రారంభించి, ఆఫ్రికా ఖండంలోని దేశాల యాత్ర అనంతరం రెండవ దశలో భాగంగా మధ్య ప్రాచ్య  దేశాల శాంతి యాత్ర నిర్వహిస్తున్నాము. మానవ ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం సాహిత్యం ద్వారా  సాధ్యమవుతుందని అన్నారు.మధ్య ప్రాచ్య దేశాల యాత్ర కన్వీనర్ లు సుధాకర్ కుదరవల్లి, విక్రమ్ సుఖవాసి వ్యవహరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో  మీర్జా జహీర్  బేగ్ గారు  మరియు అలాగే తెలుగు సమాఖ్య కార్యవర్గ సభ్యులైన వరప్రసాద్, ఉమా మహేశ్వరరావు, కెవిఎన్ రాజు, పాపారావు , హరికిషన్ , పారేపల్లి ఎన్ వి బి కిషోర్ , నరసింహరావు రాంపల్లి, 
నెట్టెం దిలీప్  , చివుకుల శర్మతో పాటు పెద్ద సంఖ్యలో తెలుగు వారు పాల్గొన్నారు.
కామెంట్‌లు