ఇన్నాళ్ళూ నాకు తోడూనీడై
నా వెంట ఉండిన
నా చేతిసంచీ
పాపం! దిగాలుపడి
చిలక్కొయ్యకు వేలాడుతోంది!
నా ఆనంద విచారాలను
తానూ అనుభవించి
నా కల్లోల అంతరంగాన్ని
భారంగా మోసి
ప్రస్తుతం మా దిగూటికి
పక్కనున్న చిలక్కొయ్యకు
దిగాలుగా వేలాడుతోంది!
ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ
నా సంసారపు సరుకులు మోసి
నా సంస్కారపు సంగతులు మోసి
నా భక్తియుక్తుల బరువులు మోసి
శుభకార్యాల సంతోషభారాలు మోసి
హృదయపు దుఃఖభావనలు మోసి
నా కార్యాల(యాల) కాగితాలు మోసి
నా శిక్షణల సామగ్రి మోసి
నా శరీరంలో తానూ ఒకభాగమై
నేను నడిచిన ప్రతిచోటికీ
తానూ పయనమై
సర్వకాల సర్వావస్థల్లోనూ
సదా సన్నద్ధంగా ఉండి
నాశ్రమనూ, భారాన్నీ
నిరంతరం కనిపెట్టుకుని
తన స్వామి భక్తిని చాటుకున్న
నా భుజపు నేస్తం
తన జీవితాన్ని నాకు అంకితమిస్తూ
పాపం! అలా చిలక్కొయ్యకు
దిగాలుగా వేలాడుతూ
ఆశగా నావైపు చూస్తూనే ఉంది
“నేను మీ సేవకు సదా సిద్ధం!”
అంటూనే ఉంది!!
**************************************
నా వెంట ఉండిన
నా చేతిసంచీ
పాపం! దిగాలుపడి
చిలక్కొయ్యకు వేలాడుతోంది!
నా ఆనంద విచారాలను
తానూ అనుభవించి
నా కల్లోల అంతరంగాన్ని
భారంగా మోసి
ప్రస్తుతం మా దిగూటికి
పక్కనున్న చిలక్కొయ్యకు
దిగాలుగా వేలాడుతోంది!
ఇన్నాళ్ళూ, ఇన్నేళ్ళూ
నా సంసారపు సరుకులు మోసి
నా సంస్కారపు సంగతులు మోసి
నా భక్తియుక్తుల బరువులు మోసి
శుభకార్యాల సంతోషభారాలు మోసి
హృదయపు దుఃఖభావనలు మోసి
నా కార్యాల(యాల) కాగితాలు మోసి
నా శిక్షణల సామగ్రి మోసి
నా శరీరంలో తానూ ఒకభాగమై
నేను నడిచిన ప్రతిచోటికీ
తానూ పయనమై
సర్వకాల సర్వావస్థల్లోనూ
సదా సన్నద్ధంగా ఉండి
నాశ్రమనూ, భారాన్నీ
నిరంతరం కనిపెట్టుకుని
తన స్వామి భక్తిని చాటుకున్న
నా భుజపు నేస్తం
తన జీవితాన్ని నాకు అంకితమిస్తూ
పాపం! అలా చిలక్కొయ్యకు
దిగాలుగా వేలాడుతూ
ఆశగా నావైపు చూస్తూనే ఉంది
“నేను మీ సేవకు సదా సిద్ధం!”
అంటూనే ఉంది!!
**************************************
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి