* అతడో గొప్ప గ్రంధ కర్త *;- కోరాడ నరసింహా రావు
అతడికి ....బాల్యమే , ప్రాధమికవిద్య  ! 
  
యవ్వనమే... మాధ్యమికవిద్య..!! 

కుటుంబమే... 
        ఉన్నత విద్య!!! 

వృద్దాప్యమే ... "జీవిత0" 
అనే   పీ హెచ్ డి...!! 

అతని జీవిత0... అతనికి, 
  ఎవరికీ  ఏ స్కూల్ళూ... 
  కాలేజీలు... యూనివెర్సిటీలు
 నేర్పించలేని జ్ఞానాన్ని బోధించి0ది  ! 

అతని జీవితం అతనికి
   ఎన్ని నేర్పిందని..! 
నవ్వటం- ఏడవటం లాంటి
 ఎన్నో ద్వంద్వాలతో పాటు... 
 ప్రేమ, అనురాగము లాంటి
 ఎన్నోసారూప్యాలనూ నేర్పింది

నటన - వంచనలాంటి వాటినీ ప్రేమ- సేవ లాంటి వాటినీ నేర్పింది..! 

ఇది- అది అనేమిటి.... 
 ఒక సంపూర్ణ జీవితాన్ని... 
  ఈ సమాజంలో  ఎలా జీవిం చాలో సోదాహారణ0గా... 
 కూలంసంగా నేర్పేసి0ది..!! 

జన్మకు అర్ధ- పరమార్దాలను
ఏ యూనివెర్సిటీ నేర్పనంత
 గొప్పగా... అతని జీవితం, అతనికి నేర్పేసింది...! 

నిజమే కదూ...! 
  జీవిత0 కన్నా గొప్ప విద్యాల యం ,
ఈ ప్రపంచ0 లో ఏముంటు0ది...?! 

జీవితమే విద్యాలయ మై... 
  అనుభవాలే  పాఠములై... 
  గొప్ప జ్ఞాన సంపన్ను డైన
  గ్రంధ కర్త ఐనా డతడు..!! 
      ******

కామెంట్‌లు