సైన్స్ సమాచారం! అచ్యుతుని రాజ్యశ్రీ

 మనకు కళ్ళు దేవుడు ఇచ్చిన ముఖ్యకానుక. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం.అవి మనవ్యక్తిత్వం పర్సనాలిటీ తెలిపే వాకిళ్లు.కళ్ళ ఆకారం ని బట్టి ఆవ్యక్తి ని గూర్చి తెలుసుకోవచ్చు.పైకి లేచిన షేప్ లో ఉన్న కళ్ళు ఏదో తెల్సుకోటం కోసం తాపత్రయ పడ్తాయి. జిజ్ఞాస ఉంటుంది.ప్రతివస్తువుని గూర్చి ఆమూలాగ్రం తెల్సుకోటమే వారి ధ్యేయం.చాలా తక్కువ మాట్లాడ్తారు.కళ్ళు షేప్ వాలినట్లుంటే శాంతంగా ఆలోచించి ఛాలెంజ్ ని ఎదుర్కొనే ధైర్యం ఉన్న వారు.గుండ్రని కళ్ళుంటే కలుపుగోలుగా అందరితో కలిసి పోతారు. పాజిటివ్ భావం కల్గిస్తాయి.కిందామీదా పడినా విజయం మీదే సుమా!
వెడల్పాటి కళ్ళుంటే ఛాలెంజ్ స్వీకరించి అసాధారణ విషయాలు ఎదుర్కొనే ఉత్సాహం ఉల్లాసం తో ఉంటారు.ఆల్మండ్ షేప్ ఉంటే జీవితంలో ఛాలెంజ్ ని చతురతతో హాండిల్ చేస్తారు.జీవితంలో రకరకాల అనుభవాలు వాటినుంచి పాఠాలు నేర్చుకుంటారు.చాలా చిన్న కళ్ళున్న వారు ప్రాక్టికల్ గా ఆలోచించి ఆచరణలో పెడ్తారు.త్వరగా చలించరు.పైకి ఉన్న కళ్ళు దృఢచిత్తం మహత్వాకాంక్షకి లోగిళ్ళు
కామెంట్‌లు