అలకం ‌.... అచ్యుతుని రాజ్యశ్రీ

 మనం అలకం అనేపదం వినలేదు కదూ ? దాని కింద తెలుసుకుందాం.కర్ణుడు పరశురాముని దగ్గర బ్రహ్మాస్త్రం అనే విద్యను నేర్చుకుని అర్జునుడికన్నా గొప్ప వాడు అనిపించుకోవాలనే తాపత్రయం తో భృగుమహర్షి వంశంవాడిని అని చెప్పాడు.కోరిక నెరవేరాలంటే అబద్ధం ఆడక తప్పదు.ఐనా పరశురాముడు కూడా భృగువంశంవాడేకదా? తను శిష్యుడు అంటే గురుపుత్రుడు.ఆయన శరీరం విడిచిపెడితే కన్నకొడుకు తో సమంగా కర్మకాండలు చేయవచ్చు.కర్ణుని సపర్యలకు సంతోషించి అన్ని విద్యల్లో తర్ఫీదు ఇచ్చి ఓరోజు పరశురాముడు అతని తొడపై తలపెట్టినిద్రపోయాడు.అలకం అనే కీటకం కర్ణుని తొడకిందచేరి చర్మాన్ని కొరికి లోపలికి వెళ్లింది.అలకం క్రితం జన్మలో రాక్షసుడు.భృగుపత్నిని అపహరించాడు.శాపంచేత పురుగైనాడు. పరశురాముని చూపు దానిపై పడితే దానికి శాపవిమోచనం కల్గుతుంది.కర్ణుని నెత్తురు శరీరంకి తగిలి మెలుకువ వచ్చిన పరశురాముని చూపు తో ఆక్రిమి రాక్షసుడిగా మారి తన వృత్తాంతం చెప్పాడు.కర్ణుడు అబద్ధం చెప్పాడనే కోపంతో " నీకు ఆమంత్రం సరైన సమయంలో గుర్తు రాదు" అని శపించాడు పరశురాముడు.ఇలా కర్ణుడు దురదృష్టవశాత్తు శాపాలు బారిన పడ్డాడు.లేకుంటే దుర్యోధనుడి తో అధర్మం పెరుగుతుంది.అంతా దైవ సంకల్పం 🌹
కామెంట్‌లు