వేమన జయంతి ఉత్సవాలు

 సామాజిక చైతన్య దీప్తి, ప్రజాకవి వేమన జయంతి సందర్భంగా తెలంగాణ ఆదర్శ పాఠశాల బచ్చన్నపేట మండలం, జనగామ జిల్లాలో వేమన ఫౌండేషన్,అనంతపురం వారి ఆధ్వర్యంలో శ్రీ అప్పిరెడ్డి హరినాధ రెడ్డి గారి ఆధ్వర్యంలో వేమన పద్య పఠన పోటీలలో పాల్గొని బహుమతి పొందిన విద్యార్థులకు పతకాలు, ప్రశంసా పత్రాలు,పుస్తకాలు బహుమతులుగా అందివ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి కె.కృష్ణవేణి గారు, తెలుగు ఉపాధ్యాయులు శ్రీ స్వర్గం నర్సింహులు గారు, శ్రీ మీసాల సుధాకర్ గారు, శ్రీమతి పర్వీన్ గారు మరియు  ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులలో తెలుగు భాష పట్ల అభిరుచిని కలిగించడం,
నైతిక విలువలు పెంపొందించడం, వేమన పద్యాలలోని గొప్పదనాన్ని తెలియజేయడం కోసం వేమన పద్య పఠన పోటీలు నిర్వహించేందుకు అవకాశం ఇచ్చి,మా విద్యార్థుల కోసం పతకాలు,ప్రశంసా పత్రాలు,పుస్తకాలు పంపించిన వేమన ఫౌండేషన్,అనంతపురం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కామెంట్‌లు