భక్త సావితామాలి! అచ్యుతుని రాజ్యశ్రీ

 పాండురంగని భక్తుల్లో మనకు తెలియనివారు ఎందరో ఉన్నారు.వారిలో సావితామాలి ఒకడు.అరుణభేండి అనే పల్లెలో తోటమాలి అతను.పూర్వజన్మ సంస్కారం తో బాల్యంలోనే భక్తి అలవడింది.తండ్రి భజన్లు వింటూ పెరిగాడు. సావితా తోటపని చే‌స్తూ దైవస్మరణ లో మునిగితేలేవాడు.జనాబాయి తో పెళ్ళి ఐంది.ఒకసారి ఆమె బంధువులు ఇంటికి వస్తే సావితా తన భక్తి లోకంలోనే విహరించడం భార్యకు కష్టం కల్గి అదే నిలదీసి అడుగుతుంది.అతని జవాబు ఇది" నీ నా అనే భేదం నాకు లేదు.అంతా పాండురంగ విఠలుడే" అని జవాబిస్తే ఆమె పశ్చాత్తాపపడ్తుంది.నాందేవ్ అతని ఇంటికి వస్తాడు.భోజనసమయంలో ఓ చింపిరి జుట్టు మురికి బట్టల్లో ఉన్న ఫకీర్ ఆకలిగా ఉంది అని సావితా ఇంటిముందు నిలబడ్డాడు.తనతో పాటు అతనికి అన్నం వడ్డించిన సావితా పై కినుక వహించాడు కానీ ఆరోజు సాయంత్రం గుడికి వెళ్ళిన నాందేవు సావితాకి గర్భగుడిలో స్వామి విగ్రహం బదులు ఫకీరు కన్పడటం చూసి ఆశ్చర్య పోయారు.నాందేవ్ కి సావితా నిర్మల భక్తి అర్ధమై పశ్చాత్తాపం చెందాడు.ఆనాటి తోటి భక్తుల గొప్ప దనం గుర్తించిన వాడు సావితా మాలి పాండురంగని పై భక్తి గీతాల మాలిక లల్లి ఆయన లో ఐక్యమైన భక్త శిఖామణి 🌷
కామెంట్‌లు