రంగులహంగులు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
రంగులు
హంగులు
పొంగులు

రంగులు
వెలుగులు
విలాసాలు

రంగులు
బొమ్మలకు
ప్రాణము

రంగులు
చిత్రాలకు 
అందము

రంగులు
పువ్వులకు
పొంకము

రంగులు
జీవితానికి
రసాత్మకము

రంగులు
ప్రపంచానికి
కళాత్మకం

రంగులు
సీతాకోకచిలుకలకు
ఆకర్షణీయము

రంగులు
ప్రకృతికి
ప్రకాశం

రంగులు
హరివిల్లుకు
దర్పణం

రంగులు
కళ్ళను
కట్టేస్తాయి

రంగులు
మనసును
పట్టేస్తాయి

రసికుల్లారా
రంగుల్లోమునగండి
రంగుల్లోతేలండి

రంజకుల్లారా
రంగులప్రపంచాన్నివీక్షించండి
జీవితాన్నిరంగులమయంచేసుకోండి

రంగులు
అద్దుకోండి
ఆనందించండి

రంగులు
చల్లండి
పండుగచేసుకోండి

రంగుల
జీవితానికి లోకానికి
స్వాగతం సుస్వాగతం


కామెంట్‌లు