అలాగే జాయ అన్న పదానికి అర్థం భార్య అని అత్తారింటికి వచ్చిన ప్రతి స్త్రీ అలంకారాల పైన ఆడంబరాల పైన మనసు పెట్టడం సహజం అక్కడ ఉన్న అందరికన్నా తన ప్రత్యేకతను కనపరుచుకోవాలని మనసులో భావం ఉంటుంది. ఆ విషయాలన్నిటిని అత్తమామలతో చెప్పుకోలేదు భర్తతో చెప్పి నాకు అది కావాలి ఇది కావాలి అని కోరుతూ ఉంటుంది. ఆయన కొత్త కనక ఆమెకు కావలసిన ప్రతిదీ కొని తీసుకువచ్చి తన కోరికను తీరుస్తాడు. అలాగే ఇంటిలో కావలసిన వస్తువులు కొంచెం డాబు దర్పంతో కూడినవి ఉండేలా కోరుకుంటుంది. అమ్మలక్కలు వచ్చినప్పుడు తన గొప్పతనాన్ని చాటాలి అన్న అభిప్రాయం ఆమె మనసులో నిక్షిప్తమై ఉంటుంది. జ తో వచ్చే మరొక శబ్దం జాత వేద అంటే అగ్ని నిప్పు అని అర్థం నిప్పు అంటేనే దహించి వేసేది దానిలో ఎన్ని పదార్థాలు వేసినా అలా దహించుకుపోతాయి తప్ప ఏ ఆకారము మిగిలి ఉండదు ప్రతిపదార్థాన్ని బూడిదిగా చేయడం దాని స్వభావం ఇంటిని దహిస్తుంది మనిషిని దహిస్తుంది ఇది అది వారు వీరు అన్న పేర్లు ఉండాలి తెలియదు అందుకే నిప్పును దేవునిగా భావిస్తారు హిందువులు అది చీకటిలో ఉన్న మానవాళికి చక్కటి వెలుగును ఇచ్చి మార్గాన్ని చూపించడానికి దోహదపడుతుంది ఉన్నదానిని నామ రూపాలు లేకుండా తుడిచి పెట్టడానికి పనికి వస్తుంది. దానితో నిత్యం మనం చేసే భోజనం తయారవుతుంది ఏ కొంచెం అప్రమత్తంగా ఉన్నా శరీరాన్ని కాల్చివేసే గుణము దానికి ఉంది అలా ఎన్నిటిని చేసినా దానికి సంతృప్తి ఉండదు.
ఇక చివరిది జలాశయం లేదా జలధి నీటితో కూడినది నది నదములు అన్ని తూర్పు నుంచి పడమరకు వెళ్లే నదులుకొని పడమర నుంచి తూర్పుకు ప్రవహించేవి మరికొన్ని ఉన్నాయి అన్నీ కూడా తమ నీటిని తీసుకుని వెళ్లి సముద్రంలోనే కడుపుతుంది ఎన్ని నదులు దానిలో కలిసిన ఇంకా కలుపుకునే గుణం ఆ సముద్రానికి ఉన్నది దానికి ప్రకృతి కూడా సహకరించేది ఏమిటి అంటే ఎండ విపరీతంగా ఉన్నప్పుడు సముద్రం మీద ప్రసరించి ఆ నీటిని ఆవిరి చేసి ఆకాశానికి తీసుకుని వెళ్లి అక్కడ నుంచి వర్ష రూపంలో మనకు జీవాన్ని ఇస్తుంది కనుకనే ఆ జలధి ఎంత జలం వచ్చినా తనలో ఇమిడ్చుకొని సమాజానికి మంచి చేయాలి అన్న అభిప్రాయం లోనే ఉంటుంది అది నిత్య కృత్యం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి