స్థాయి భేదాలు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 ఏ వ్యక్తి మరో వ్యక్తిని బాగు చేయను లేడు  చెడగొట్టను లేడు అది అతని చేతిలో లేని పని  ఇంటి దగ్గరే ఎంతో సక్రమంగా పెంచుతూ ఉన్న తల్లిదండ్రులకు దూరంగా వచ్చి  బడికి వెళ్లిన తరువాత తన చెడ్డ స్నేహితులతో తిరుగుతూ  వారు మాట్లాడే అశ్లీలమైన నీచమైన మాటలనే అలవాటు చేసుకుంటూ  వాడి దగ్గర అలాంటి మాటలే  మాట్లాడుతూ చివరకు తల్లిదండ్రుల దగ్గర కూడా మాట్లాడే స్థితికి  దిగజారే పరిస్థితి  ఏర్పడక ముందే  తల్లిదండ్రులు అతని  ప్రవర్తనను జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి  బడికి అని బయలుదేరి  స్నేహితులుతో తిరుగుతూ  బడి మాని చిన్న చిన్న ఆటలు ఆడుకుంటూ వారిలో వారు తగాదాలు పడుతూ  చివరకు పరీక్షల సమయం వచ్చేసరికి గుండు సున్నాలతో వారి పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు  మాత్రమే తల్లిదండ్రులకు వాడి విషయం తెలుస్తుంది. అలా కాకుండా  అనుక్షణం అతనిని పరిశీలనా దృష్టితో చూస్తూ  ఏ ప్రక్కదారికి వెళుతున్న దానిని సక్రమమైన మార్గంలో పెట్టవలసిన బాధ్యత తల్లిదండ్రులు తీసుకున్నట్లయితే అలాంటివి జరగవు అని వేదాంతులు చెబుతూ ఉంటారు  బిడ్డల శిక్షణ అనే విషయాన్ని గురించి గుడిపాటి వెంకటాచలం గారు  ఒక అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశారు  దానిలో ఏ పద్ధతిలో ఏ పిల్లవాడు  అంటే బీదరికంలో ఉన్న వాడు ఒక పద్ధతిగా  అధిక ధనవంతులు మరో పద్ధతిగా  సామాన్యులు ఇంకొక విధంగా  వారి జీవిత ప్రయాణం కొనసాగిస్తూ ఉంటారు  సమయాన్ని పాటించడం కోసం అతి బీదవాడు  బడికి వెళ్లాలంటే నడుచుకుంటూ దానికి తగిన సమయాన్ని దానికి కేటాయించి  ఆ ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు  అతిథనవంతులు వాహనాలతో వచ్చి  సమయానికి బడికి వస్తూ ఉంటాయి  సామాన్యుడు సైకిల్ మీద గాని నడకలో కానీ వస్తాడు  ఈ పద్ధతులు గమనించినప్పుడు కూడా వారిలో ఉన్న మానసిక స్థితి బయటపడుతుంది. కారులో వెళుతున్న ఆకర్షణీయమైన అందమైన  ఆహార్యంతో వెళుతున్న కుర్రవాడు  కాలినడకన కాలికి చెప్పులు కూడా లేకుండా నడిచి వెళుతున్న కురవాడిని చూస్తే చాలా చులకనగా ఉంటుంది  ఇష్టం వచ్చిన హాస్యోక్తులతో అతని మనసును  కష్టపెడుతూ ఉంటాడు కూడా. పేదవాడి కోపం పెదవికి చేటు అని మన పెద్దలు చెబుతూ ఉంటారు  వారు అంటున్న  మాటలకు ఇతనికి బాగా కోపం వచ్చి పళ్ళు బిగించి  పెదాలను ఆ పళ్ళ మధ్యలో ఉంచినట్లయితే  అది తనకే నష్టం  కనుక ఉదారంగా అతను చెప్పిన మాటలను విని విననట్లుగా ప్రవర్తిస్తూ  సహనాన్ని అలవాటు చేసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది  దీనినే చెడులో మంచి  అంటూ ఉంటారు మన పెద్దలు  వారి పుస్తకాలను తీసుకున్న  ధనవంతులకు తమ సేవకులే పుస్తకాలను తీసుకువచ్చి ఒక్కొక్క పుస్తకం ఎప్పుడు కావాలంటే అప్పుడు దానిని ఇస్తూ ఉంటారు.


కామెంట్‌లు