స్త్రీ ఉనికి;-డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు6302811961.
 ఈ భూ ప్రపంచంలో స్త్రీ లేకుండా  ఒక్క పురుష జాతి మాత్రమే ఉంటే  ఒక ఊహా మాత్రం ఆలోచించినట్లయితే  100-150 సంవత్సరాలలో  మానవజాతి లేకుండా పోతుంది  ఇది సత్యం  స్త్రీ రావడంతో  సంతాన ఉత్పత్తి కలిగి  ఈ ప్రపంచం నిండుగా కనిపిస్తోంది  అలా పెరుగుతూ పెరుగుతూ పోతూ ఉంటే మనుషులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరూ ఉండరు కనుక  ప్రకృతి సిద్ధమైన మరణము పునర్జన్మము  తప్పనిసరి లేకపోతే నేను ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారం చేసిన జనం జనం  రూపకం లాగా  మనిషి పైన మనిషి నిలబడి  ఉండే స్థితి  మనిషిని మనిషి పీక్కుతినేఆకలి  కనుక ప్రకృతిసమతుల్యాన్ని  పాటించి  ప్రతి జీవికి  క్రిమి కీటకాదులతో సహా  జీవన ప్రమాణాన్ని నిర్ణయిస్తుంది  ఆ నిర్ణయించేది  బ్రహ్మ విష్ణు త్రిమూర్తులని వేదాంతం చెప్పిన ప్రకృతి అని హేతువాదులు చెప్పిన  ప్రకృతి సిద్ధమైన ఏ విషయాన్ని  ఏ శాస్త్రము ఆపలేదు అన్నది  అందరికీ అవగాహన అయ్యే విషయం. ఏ ఇంటిలోనైనా ఆడపిల్ల జన్మించింది అంటే లక్ష్మీదేవి తన ఇంటికి వచ్చినట్టుగా భావిస్తారు  ఆ తల్లిదండ్రులు  ఆ పాపకు ఎనిమిదవ సంవత్సరం వచ్చే అంతవరకు  పూర్తి లోకజ్ఞానం తెలియదు  తల్లి చాటు బిడ్డగానే పెరుగుతుంది  ఆమెకు కావలసిన ప్రతి విషయం అమ్మ చెప్పి తీరవలసినదే  ఒకవేళ అమ్మ కోపగించుకున్నా తండ్రి దగ్గరకు మాత్రం వెళ్లదు  తన చిలిపి చేష్టలతో కవ్వించి నవ్వించి ఆమెతోనే చెప్పించుకుంటుంది  అలాంటి బుజ్జి తల్లికి ఎనిమిదో సంవత్సరం వచ్చేటప్పటికి  తానేమిటో అర్థం అవుతుంది  జ్ఞాన సంపన్నకు మొదటి మార్గం  మెట్టు  తన ప్రవర్తనలో అనేక మార్పులు వస్తాయి  మగ పిల్లలకు దూరంగా ఉండడం ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడడం  ఏ పని కావలసి వచ్చినా ఒంటరిగా చేయడానికి ఇష్టపడకపోవడం  సహజంగా వచ్చే లక్షణాలు తాను పెరిగి పెద్దదై  వివాహం అయిన తర్వాత  పుట్టినింటి నుంచి బయలుదేరి  అత్తారింటికి వస్తూ గుమ్మం దగ్గర ఆగి  తన పుట్టింటి  పద్ధతులను అన్నిటినీ మర్చిపోయి  అత్తగారు గుమ్మంలో పెట్టిన  బియ్యం  మిగిలిన పదార్థాలను కాలితో తన్ని లోపలకు ప్రవేశిస్తుంది  పరోక్షంగా దాని అర్థం  ఈ క్షణం నుంచి నేను ఈ ఇంటి కోడలిని  ఈ ఇంటికి కావలసిన ప్రతి విషయాన్ని నేను  దగ్గర ఉండి చూసుకోవాలి  ఈ ఇంటి గౌరవ మర్యాద లను కాపాడవలసిన బాధ్యత నా భుజ స్కందల పై ఉన్నది  ఈ కుటుంబంలో ఉన్న ఏ  బంధువుకు  మానసికంగా కానీ శారీరకంగా కానీ బాధ కలిగించకూడదు  ఆడపిల్లలు ఉంటే ప్రత్యేకంగా వారితో  ఎలా స్నేహంగా ఉండాలో  వారి మనస్తత్వాలను తెలుసుకొని వారికి అనుగుణంగా తన మనసును మలుచుకుంటుంది  ప్రతి పనిబాధ్యతాయుతంగా  చేయడానికి ఉపక్రమిస్తుంది ఆ బాల.


కామెంట్‌లు