మానవ ధర్మం;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 చిన్నపిల్లలకు పాఠాలు చెప్పడంలో విష్ణుశర్మను మించిన అధ్యాపకులు మరెక్కడా మనకు కనపడరు  పలకా బలపం తీసుకోకుండా  కథలుగా ఆయన చెప్పే అనేక విషయాలు  చిన్నపిల్లలే కాదు ప్రతి వ్యక్తి అనుసరించి తీరాలి అన్న పద్ధతిలో చెబుతారా ఇలా  యూనివర్సల్ ట్రూత్ లో ఆయన రచనలు ఉంటాయి. మానవులతో సత్సంబంధాలు ఎలా ఉండాలి ఎలాంటి వారితో స్నేహం చేస్తే వీడికి కూడా మంచి అలవాట్లు చేకూరతాయి  ఎలాంటి వారితో స్నేహం చేయకూడదు దుష్టబుద్ధులతో చేరినప్పుడు వారి దుష్ట చేష్టలే ఈ కుర్రవాడిది కూడా వస్తాయి కనుక వారి జోలికి వెళ్ళవద్దు  ఇద్దరు మిత్రులతో కలహాన్ని కలగ చేయడం ఎట్లా  ఒకరిని ఇష్టునిగా చేసుకొని మరొకరిని ఆయిష్టునిగా చేసుకోవాలంటే ఎలాంటి పద్ధతులను మనం అవలంబించాలి. రాచరికపు వ్యవస్థలో  ఇద్దరూ రాజుల మధ్య చిచ్చు పెట్టి  ఒకరిని తన వైపుకు తిప్పుకొని  తన బలాన్ని ఎలా పెంచుకోవాలో చెప్పే అద్భుతమైన కథలు  వారి నోటి నుంచి మనం వింటే  వారు చెప్పిన ప్రతి అక్షరాన్ని మనం  అనుసరించి తీరుతాం  దానిని పరవస్తు చిన్నయ సూరి  గారు తెలుగులో అనువదించారు  దానిలో ఒక వాక్యం జరా మరణములు  లేక విద్యా ధనములను  సంపాదించవలెను  అన్న లోక నీతి మనకు దానిలో కనిపిస్తోంది చదవడానికి వెళ్ళినవాడు నాకు వయసు పెరుగుతూ ఉంది కదా నాకు చదువు దీనికి దీనివల్ల ఎలాంటి  ప్రత్యేక సదుపాయాలు ఉన్నాయి అని ఆలోచించకూడదు తాను ఒక విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఆ విషయాన్ని గురించిన మరికొన్ని విశేషాలు ఏమైనా ఉన్నాయా అని తెలిసిన వారి దగ్గర నుంచి విషయాలను సేకరించాలి
ధనాన్ని సంపాదించడంలో కూడా వారు చెప్పిన నీతి  నేను ముసలి వాడిని కాబోతున్నాను ఏ క్షణానఅయినా నన్ను మృత్యువు కబళించవచ్చు  ఈ దేహాన్ని విడిచి పెట్టే నాకు ఈ డబ్బుతో సంబంధం ఏముంది నేను సంపాదించను అని మడిగట్టుకుని కూర్చోకూడదు  చివరి క్షణం వరకు నీకు ఉన్న  వనరులను ఆధారం చేసుకుని నీవు ఎంతవరకు సంపాదించగలిగితే అంతవరకు సంపాదించి తీరవలసినదే  దానికి ఎంత అన్న నియమో లేకుండా  ఎంతైనా సరే చేయవలసిన ధర్మం నీకున్నది  దీనికి కారణం  నీ వేడుక వల్ల కుటుంబం  నీపై ఆధారపడి ఉన్న వ్యక్తుల జీవితాలు  భార్యాపిల్లల ప్రగతిని కూడా ఆలోచించి చేయవలసిన  విధిని మర్చిపోకూడదు అని చెబుతున్నారు.


కామెంట్‌లు