కొత్త అల్లుడు;- డా.నీలం స్వాతి,చిన్న చెరుకూరు గ్రామం,నెల్లూరు. 630281961.
 అలాగే ఇవాళ మరికొన్ని విశేషాలను పిల్లలకు చెప్పాలి  విద్యను సముపార్జించుకోవడంలో ఎలాంటి తృప్తి ఉండకూడదు  దీనికి మన పెద్దవారు  ఐదు జకారాలతో కూడిన  ఉదాహరణలను అందిస్తున్నారు  వాటిలో మొదటిది  జా మాత అంటే అల్లుడు  వివాహం అయిన కొత్తలో  అల్లుడ్ని అత్తా మామ వారి ఇంటికి తీసుకెళ్ళి సకల మర్యాదలు చేస్తూ అతనికి కావలసిన ప్రతి అవసరాన్ని తీరుస్తూ ఉంటారు  ఇది ప్రత్యక్షంగా మనం చూస్తూనే ఉంటాం  అయితే కొత్తగా పెళ్లయిన ఈ కొత్త అల్లుని   తత్వం ఎలా ఉంటుంది అంటే  ఇతను శాఖ హారికారి కావచ్చు మాంసాహారికారి అవచ్చు ఏ ఆహారం తీసుకున్న ఆహారాలలో  తనకు వారు వడ్డించినవి కాకుండా  మరెన్నో కావాలని ఆశపడుతూ ఉంటాడు  జీవితంలో తన కోరికలన్నీ ఇక్కడే తీర్చుకోవాలనుకుంటాడు.
నేరుగా అత్తమామలను అడిగి  తన కోరికలను తీర్చుకునే స్థితి అతనికి ఉండదు  మధ్యవర్తిగా భార్యను ఉపయోగిస్తాడు  నేను ఇలాంటి బట్టలు ధరించాలి అనుకుంటున్నాను  మరి ఇంత చవక బారు  వస్త్రాలను కొన్నారేమిటి అనే మాటతో  ఆమెకు పౌరుషం వచ్చి  తల్లిదండ్రుల నుంచి తనకు కావలసిన  ఇష్టమైన  వాటిని కొనిపిస్తుంది  తనకు కావలసిన ధనాన్ని గాని   ఆస్తిని  కానీ సంపాదించడానికి చూస్తాడు  అత్తమామల  స్తోమతకు మించి వారు ఎంత ఇచ్చినా ఇతనికి తృప్తి అనేది ఉండదు  అందుకే అతనిని జామాత అంటారు  అలాగే మానవ శరీరంలో దాగి ఉన్న జటరాగ్నిని ఒక్కసారి పరిశీలనగా చూసినట్లయితే  దానికి తృప్తి ఉండడం ఎవరైనా  గమనించారా.
భోక్తలుగా వచ్చే  వైదికులను చూసినప్పుడు ఒక విషయం మనకు అర్థమవుతుంది  సామాన్యంగా భోక్తులుగా వచ్చేవారు తిండి పుష్టి కలవారు అయి ఉంటారు  పంచభక్ష్య పరమాన్నములతో  షడ్రుచులతో  పూర్తి భోజనం చేసిన తరువాత  స్వామికి ఒక వక్క పలుకు వేసుకోండి అని మనం అడిగితే  అంత ఖాళీ ఉంటే మరో వంటకాన్ని తినేవాడిని కదా బాబు  అని సమాధానం వస్తుంది  అలాగే  నాలుక రుచి మరిగినది  ఎన్ని పదార్థాలను  ఎలా తిన్నా దానికి తృప్తి ఉండదు ఇంకొంచెం ఇంకొంచెం కావాలంటుంది   కడుపు నిండిన మరొక పదార్థం తినడానికి ఆరాటపడతాడు  కనుక ఈ జఠరాగ్నిని అగ్నిగా చెబుతారు  జఠరాగ్ని  అని దానికి పేరు  ఎన్ని పదార్థాలు పంపిన అన్నిటినీ దహనం చేయగలిగిన స్థితి దానికి ఉంటుంది  దానికి తృప్తి ఉండదు.


కామెంట్‌లు