కుసుమ ధర్మన్న కళాపీఠం
=====================
ఎవరి జీవితం వడ్డించిన విస్తరి కాదు
ఎంత చెట్టుకు అంత గాలన్నట్టు
ఏ తరగతి ప్రజలకైనా స్ధాయికి తగ్గట్టు
ఎక్కడో ఒకచోట ఆ లోటు కనబడుతుంది
మంచిగ చదువుతున్న పిల్లల చదువులు
కుంటు పడకూడదని మధ్యతరగతి తాపత్రయం
అపర కుబేరులైనా సుఖాలాలసులై
కోరి తెచ్చుకున్న అనారోగ్యాలు
వచ్చి పడుతున్న ధనాన్ని
ఎక్కడ దాచాలో నన్న ఒత్తిడి మరీ
ఎవరికుంది సాంత్వన కలిగిన జీవితం
కూలికెళ్ళిన వాడికి పని దొరుకుందో లేదోనని
పని నుండి వచ్చే మగడు
పూటుగ తాగొస్తాడేమోనని ఆలికి
మార్కులు తక్కువైతే అమ్మానాన్నలు
ఒకటే తిట్లమోతని విద్యార్థులకు
సీటు వస్తుందో రాదో.. వస్తే
గెలుస్తామో లేదోనన్న రాజకీయ జీవితం
ఎవరి జీవితాలలో కూడా నెమ్మదిలేదు
ఒకే ఒక్కరి జీవితాలలో ఏ బాధ ఉండదు
బోసి నవ్వుల పసిపిల్లలు పరమాత్మ స్వరూపాలు..
చీకు చింతా లేని మురిపాల లాలనలు
ప్రపంచంలో ఎవరూ సరితూగలేని
నిశ్చింత జీవనం ఆ చిన్న పిల్లల బాల్యమే..
ఎదిగే కొద్ది నలిగిపోయే జీవితాలకు
సుఖ సంతోషాల పయనం బాల్యానిదే
జీవితమంటే అంతులేని పోరాటం- జి జి రావు /తుని/-కాకినాడ జిల్లా -7891033370
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి