-ధనంమూలం;- మమత ఐలకరీంనగర్-9247593432
ఆధ్యాత్మిక వచన కవిత
=================
ధనంమూలం ఇదంజగత్
జగం బ్రతకాలంటే కావాలి ధనం
ధనం ఉపయోగించాలంటే....!
కావలసింది జ్ఞానం

జ్ఞానంతో సాధించేది ధనం
దీనులను రక్షించేదీ ధనం
ధనం సాయం చేస్తే.....!
ఔతావు దైవం

దైవంవలె జీవించు
ఈధరణిని రక్షించు
నీవంతు కృషిని సాధించు
నిరంతరం శ్రమించు

శ్రమ లేనిదె ధనంలేదు
శ్రమలోనే దైవముండు
అదినీఉనికికి మెండు

అవినీతికి తలవంచకు
అన్నదానమును మరువకు
దాతలంటె దైవాత్మలు
పుడమికి వీరే నేతలు


కామెంట్‌లు
Venkata Chandeeswar చెప్పారు…
Well said !!!
Money makes many things and even no one likes / obeys a poor king.