పంచపది బసవ పురాణము;- కాటేగారు పాండురంగ విఠల్ పంచపది రూపకర్తహైదరాబాద్ 9440530763
 141
పాండ్యుని మంత్రి నక్కలను తెచ్చి చూపాడు
శివుడు చోక్కనాథుడు భక్తుణ్ణి కరుణించాడు
అక్కడున్న నక్కలను అశ్వాలుగా మార్చాడు
తన భక్తులను పరమశివుడు సదా రక్షిస్తాడు
శివుడు బసవన్నకు ధనమిచ్చి కాపాడె విఠల!
142
బిజ్జలుడు భక్తుల మాటలన్ని విన్నాడు
బసవేశ్వరుడి భక్తిని మెచ్చుకున్నాడు
కొండెములు చెప్పినవారిని తిట్టినాడు
మరలా ఇలా చేస్తే శిక్షిస్తానని చెప్పాడు
బిజ్జలుడు బసవన్న భక్తిని కీర్తించె విఠల!
143
ఓ జంగముడు బసవడిని పరీక్షించ దలిచాడు
వేశ్య మందిరములోని ఓ దాసిని పంపించాడు
అతడు నిత్య నైవేద్యం తెమ్మని ఆజ్ఞాపించాడు
ఆమెకు బండారి ప్రసాదం తీసుకొని రమ్మన్నాడు
ఆ దాసి బసవేశ్వరుని మందిరానికి వెళ్లెను విఠల!
144
దాసి బసవని భార్య గంగాంబను చూసెను
ఆమె ధరించిన చీరచూచి భ్రమసిపోయెను
ఆ చీర అందమును వేశ్యకు వివరించెను
అది విని ఆ వేశ్య జంగముడిని పిలిచెను 
చీర తెప్పించమని జంగముణ్ణి కోరె విఠల!
145
జంగముడు వేశ్యపై వ్యామోహం కలిగున్నాడు
గంగాంబ దగ్గరికి చీర అడుగుటకు వెళ్లినాడు
అడుగకూడదని తెలిసీ ఆమె చీరనడిగాడు
భార్యతో శివునికి చీర తీసివ్వమని చెప్పాడు
గంగాంబ భక్తితో చీర విప్పి ఇస్తాననెను విఠల!
146
గంగాంబ భక్తితో తన చీరను విప్పింది
వెంటనే మరో చీర శరీరంపైకి వచ్చింది
జంగమయ్యకు చాల ఆశ్చర్యమేసింది
పరమశివుని భక్తులకసాధ్యమేముంది?
భక్తులకిలాంటివి సుసాధ్యమే కదా విఠల!
147
ఒక భక్తుడు నారచీర వలచి ఇచ్చాడు
దాసయ్య బంగారపు చీరను ఇచ్చాడు
బల్లముడు తన సతినే దానం చేశాడు
అధీరుడు మాణిక్యము దానమిచ్చాడు
మానకంజారుడు భార్య కొప్పునిచ్చెను విఠల!
148
కళ్యాణ నగరములో మాచయ్య వుండేవాడు
అతడు వీరవ్రతాచారయుతుడు,శివశరణుడు
శివభక్తుల వస్త్రాలు ఉతికి శుభ్రము చేసేవాడు
వారికి దక్షిణలతో వస్త్రాలను అందించేవాడు
వెండి కొండలా వస్త్రాలకుప్ప వుండేది విఠల!
149
రోజూ తెల్లవారుఝామున రేవుకు వెళ్ళేవాడు
వస్త్రాలెవరు తాకరాదని చాటింపు వేసేవాడు
మాచయ్యను చూడక ఒకడొస్త్రాలు తాకాడు
వెంటనే మాచయ్య అతనిని హతమార్చాడు
బిజ్జలుడు అతనిని చంపమని ఆదేశించె విఠల!
150
బిజ్జలుడు చంపడానికి ఏనుగును పంపాడు
మాచయ్య దానిని అవలీలగా చంపివేశాడు
ఇది విని బిజ్జలుడాశ్చర్య చకితుడయ్యాడు
బసవన్నొచ్చి మాచయ్య చాకలి కాదన్నాడు
సాక్షాత్తు లింగమూర్తి-శివయ్యేనిని అనె విఠల!


కామెంట్‌లు