అహల్య;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 ఈ మహత్వ సాధనలో ఏ కొంచెం తేడా వచ్చినా అది  వేలకొలది సంవత్సరములు తపస్సు చేసిన దానిపై ప్రభావం చూపుతుంది అహల్య దౌర్భల్యం గౌతముని తపస్సుకు ఆటంకం కలిగించిందో అదే విధంగా గౌతముని ఉద్విగ్న స్వభావం అతనిని తపో మార్గంలో అతన్ని విచలితున్ని చేసింది ఇంద్రుని శపించడంలో దోషమేమీ లేదు కానీ అహల్యను కూడా  శపించడంలో ఒక మహర్షికు ఉండవలసిన సమదృష్టి సమతుల్య భావం లోపించినట్లు కనిపిస్తుంది అందుచేతనే గౌతమునికి మరల తపస్సు చేయవలసిన అవసరం కలిగింది. విశేషమేమిటంటే వీరందరితలంగా అందరికీ శ్రీరాముని దర్శనం లభిస్తుంది. మిథిలా మార్గము శ్రేష్టమై ప్రసిద్ధి చెందింది.ఆశయం ఇదేనని తెలుసుకోవాలి
రామాయణంలో అనసూయ సీతాదేవి కలయిక అయోధ్యకాండ అరణ్యకాండల సంగమ స్థలంలో కనిపిస్తుంది మనకు దండకారణ్య  ప్రవేశ మార్గమైన  అత్రి ఆశ్రమంలోకి సీతారాములు లక్ష్మణుడు చిత్రకూటం నుంచి నడుస్తూ నడుస్తూ అక్కడికి చేరుకుంటారు ఇక్కడే అత్రి మహర్షి సహధర్మ చారిని అనసూయతో సీతాదేవికి పరిచయం లభిస్తుంది రామాయణ ఇతివ్రత పరిధిలోనే కాకుండా సీతాదేవి జీవిత గమనంలో కూడా ఈ కలయికకు ప్రాధాన్యత ఉంది రామాయణం రామునికి సంబంధించినదే కాదు సీతారాముల ఉమ్మడి ప్రయాణ విశేషమని చెప్పబడింది ఈ ఉమ్మడి ప్రయాణం చిత్రకూటమిలో భరతునికి వీడ్కోలు పలికిన తర్వాతనే ఆరంభమవుతుంది  ఈ ఆశ్రమాల నుంచే భరతుడు రాజ్యపాలనకై శ్రీరాముని  పాదుకలు చేత కొని వెళ్లడం సీతారాములు లక్ష్మణుడు దండకారణ్యం వైపు బయలుదేరుతారు. చిత్రకూటం అత్యంత రమణి యస్థలం కానీ భౌతిక మానసిక కారణాల చేత శ్రీరాములు ఆ స్థలాన్ని వీడిపోయాడు ఈ విధంగా అత్రి ఆశ్రమంలో ఉండే శ్రీరాముని ఆధ్యాత్మిక ప్రయాణం ప్రారంభమైంది శ్రీరామ సీత లక్ష్మణులు తన ఆశ్రమ ప్రవేశం చేసినప్పుడు అమిత సంతోషాంతరంగుడయినాడు ఎంతో కాలంగా ఎదురుచూసిన అతిధులు వచ్చినట్లుగా అత్రి ఈ ముగ్గురకు గొప్ప అతిధి సత్కారాన్ని ఇస్తాడు  ఇక్కడ జరిగిన విశేషం ఏమిటంటే  జరిగిన సన్మానం శ్రీరాముని పేరుతో జరిగిన కూడా సన్మాన సత్కారాలు సంభాషణలు అన్ని జరిగింది సీత అనసూయ మాత్రమే అధికంగా జరిగాయి ప్రారంభిక సన్మానం తర్వాత శ్రీరాముడు అత్రికి తన భార్యను పరిచయం చేస్తాడు అలా పరిచయ కార్యక్రమాల సరళలోనే మనకు అత్రి ద్వారా అనసూయ ఆధ్యాత్మిక ఉన్నతి విశిష్టత అందుబాటులోకి వస్తుంది.
కామెంట్‌లు