ఏక సంధాగ్రాహి వేంకట రాజుగారు;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.
 మల్లుడు అంటే  రాజుకు మనసులో ప్రేమ ఉన్నా అతని రెండు పనులకు అసహ్యించుకుంటూ ఉంటాడు. నీతి బోధ చేసేటప్పుడు తలని వంచుకుంటాడు  తాను చేస్తున్నది తప్పు అని తెలిసి కూడా  గాడి తప్పుతూ ఉంటాడు  ఒక రోజు రాత్రి ఒంటరిగా వెళ్లి  కల్లు లొట్టెల దించి కల్లు తాగి తూలుతూ వెళుతూ త్రోవలో పడిపోవగా  ప్రభుత్వ బంటు ఒకడు ప్రక్కన చేరి  ఈ వార్తలను అన్నిటినీ వ్రాస్తూ ఉన్నాడు కానీ మల్లు అతడిని గమనించలేదు  అంతలో ఎక్కడి నుంచి వచ్చినదో ఒక బాణం వచ్చి గూఢచారికి గుండెలోన దిగిపోయింది  అతడు మరణించినంతలో అక్కడికి ఒకతను వచ్చి చూశాడు  రాసిన వాగుడంతా వింత వింతల విప్లవ వార్తలు ఎన్నో మల్లు దొర పలుకుతున్నాడు ఆ మత్తులో ఆ వచ్చినవాడు మల్లు దొరను  ఒక కంట కనిపెడుతున్న రాజు వద్దకు తీసుకొని వెళ్ళాడు  అతడే వేగును చంపి విప్లవానికి వచ్చే ఉపద్రవాన్ని ఆపివేశాడు  అతడు మల్లుని తీసుకొని  ఆ వార్తలలో ఉన్న  రహస్యాలతో పాటు  రాజుకు తెలియజేయగా  రాజుని అప్రమత్తును చేశాడు మల్లు దొర ఇక్కడే ఉంటే మనకు ప్రమాదం ముంచుకు వస్తుంది అని తలచి  మల్లుతో రాజు మల్లుడా  మన ఉద్యమాన్ని వదిలి వెళ్ళిపో  నీవు చేస్తున్న ఈ తప్పుని క్షమించాలి ఇక క్షమించలేను  అనగానే మళ్ళీ రాజు పాదములను పట్టుకొని  రాజా తప్పు చేశాను  తప్పును క్షమించు నీ మాటలు మరిచి నేను ఇంత చేశాను నా మొహాన్ని చూపడానికి కూడా మనసు అంగీకరించడం లేదు  మన ఆశయాన్ని కూడా మరిచి  యుద్ధ రంగంలో దూకి పోరాడటం మాని మీ ఆశలను పాడు చేశానో ఎంత పాడు పని చేసినో నేను  నా యెడల జాలి చూపమని మాత్రం కోరను. ఆ ఆశల మత్తులో పడి నేను పాపం చేశాను  నేను చేసిన పని దేశమాత సహించదు  ఉద్యమ నీతిని తప్పి చరించిన నాకు ఇది చాలా చిన్న శిక్ష మాత్రమే అన్నాడు. అప్పుడు రాజు  ఉద్యమము యొక్క మేలు కోరిన వాడవైతే ఇక్కడ నుంచి వెళ్ళిపో  మన విడిదిలో నీవు ఉండడానికి తగవు  నిన్ను ఒక్కడినే  ఇక్కడ ఉంచితే  మన ఉద్యమ నాయకులకు అందరికీ ప్రమాదం జరుగుతుంది  వెంటనే బయలుదేరు అన్న రాజు మాటలను ఆజ్ఞాగా పాటించి  ఏడుస్తూ రాజు పాదములను పట్టుకొని  తన దగ్గర ఉన్న తుపాకీ కత్తి తన ఆయుధాలు అన్ని రాజు పాదాలకు అప్పగించాడు  ఆ దృశ్యాన్ని చూస్తున్న రాజు కనుల వెంట నీరు రాగా తమ్ముడూ మన చెలిమిని తలచుకో  మరుజన్మ వరకు నేను నిన్ను మరువగలనా అని బాధపడుతూ పలికాడు రాజు.


కామెంట్‌లు