తార;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9493811322.
 తార రాముని దోషిగా భావించలేదు దీనికంతకు శ్రీరాముడే కారకుడని భావించలేదు కారణం శ్రీరాములు తన స్నేహితుడైన సుగ్రీవుని ఒక మిత్రునిగా న్యాయం చేసి ధర్మ పాలకుడు అయ్యాడు పైగా తమ్ముడు రాజ్యాన్ని పంచకుండా నిలిచిన పాపి అయిన వాలికి తగిన గుణపాఠం చెప్పాడు ఇలా శ్రీరాముడు వారిని శిక్షించాడు తార తన పతి మరణానికి వగచినా కూడా తన మాటలు వినకుండా అధర్మ యుద్ధానికి పాల్పడు చైతన్య విధి విహితమైన ఈ దుర్మరణం పాలైనాడని తలచింది.తన పతనానికి తానే కారకుడయినాడు వాలి సద్బోధను పెడచెవిన పెట్టిన వాడు ఎవరికైనా ఇలాంటి దుస్థితి ప్రాప్తిస్తుందని తెలుసుకోవాలి ఏది ఏదేమైనప్పటికీ తార తన భర్త పట్ల మిక్కిలి  ఆదర సత్కారాలనే కనపరుస్తూ ఉండేది. ఈ ఉత్తమ సమ బుద్ధిని కలిగి ఉండడం చేతనే తారను పరమ సాధ్వీమణిగా నిలబెట్టింది భర్తకు పాదాభివందనం చేయడం భర్తను కౌగిలిలోనికి తీసుకొని పొందే ఏకాంత సుఖం ముందు తాను ఒక గొప్ప సామ్రాజ్యానికి పట్టపు రాణి అంగధుడు లాంటి 100 మంది పుత్రులకు రాజమాతగా నిలవడం వల్ల లభించే సుఖం కూడా సమానం కాదని  భావించే సమస్త ఇహలోక సౌఖ్యాలను ఛేదించి తుదకు తన భర్తతో కలిసి పరలోకానికి వెళ్లిపోవడానికి  సంసిద్ధురాలయింది  దానికి కారణం. పరలోకంలో కూడా తన భర్తకు అక్కడ తాను  లేకుండా సుఖం ఉండదు కనుక తాను మరణాన్నే కోరుకుంది కానీ హనుమంతుడు శ్రీరామచంద్రుడు ఆమెను  తమ శీతల శాంత పదావడితో వారించడానికి ప్రయత్నించారు వీర హనుమాన్లు అయితే ఆకాశం నుంచి రాలిన నక్షత్రం లాగా తన భర్త శవం పై విలపిస్తున్న తారను ఓదార్చుతూ ధైర్యాన్ని నూరిపోస్తూ నీవు మామూలు స్త్రీవి కాదు సర్వం తెలిసిన సాధ్వి మణివి విధంగా శోకించరాదు ఏది విధి విహితమో అది జరిగిపోతుంది ఆ విషయాన్ని ఆలోచిస్తూ దుఃఖించడం వల్ల ఏ ప్రయోజనం లేదు జరగవలసిన పనిని గురించి ఆలోచించాలి సుగ్రీవుని సౌజన్యం అంగదుని పరాక్రమ విశేషాలు మరిచిపోయినచో ఏ సహాయము జరగదు  ఏది జరగవలసినదో అది జరిగి తీరుతుంది పరిస్థితులతో రాజీ పడవలసిన అవసరం ఎంతైనా ఉంది. కాలం సర్వులకు నిగ్రహాన్ని ప్రబోధిస్తోంది కాల నిర్ణయాన్ని ఎవరు అతిక్రమించలేరు అని ఓదార్చుతాడు కానీ తారతన భర్తకు పరిహారంగా రాజ్యసుఖాన్ని గాని పుత్రోన్నతిని గాని వేటిని స్వీకరించడానికి తన అసమర్థతను ప్రకటించింది. ఈ మాటలన్నింటిని మరణశయ్యపై తుది క్షణాలు లెక్కిస్తున్న వాలి విన్నాడు హృదయం ద్రవించింది సుగ్రీవుడిని తన వద్దకు పిలుచుకొని తార అంతరంగాన్ని గురించి ప్రశంసించాడు  తార మాటను మన్నించి నడుచుకోమని సుగ్రీవుని కోరాడు దానివల్లనే సర్వ శ్రేయస్సు వన గూడుతుందని చెప్పాడు  సుశేషుని కుమార్తె అయిన తార నిశిత దృష్టితో ఈ మాటలను పరిశీలించి రాబోవు కాల రీతిని అంచనా వేయగలదు అందుచేతనే తార ఆలోచనలను ఎప్పుడూ గురి తప్పలేదు తన భర్త తనను ప్రశంసించిన తీరు ఆమెను మరీ వ్యాకుల పరిచింది. తన భర్తే తనకు సర్వస్వము ప్రపంచంలో అంతకుమించి ఏమీ అవసరం లేదు.కామెంట్‌లు