పండువెన్నెల;- -గద్వాల సోమన్న,9966414580
పండు వెన్నెల కురిసింది
మెండుగ మదిని దోచింది
నిండు పౌర్ణమి రోజున
వెండి గిన్నెలా మారింది

మల్లెల వన్నెల వెన్నెల
చల్లగ తనువును తాకింది
ఎల్లలు ఎరుగని వెన్నెల
పిల్లలకు తెగ నచ్చింది

మెత్త మెత్తని వెన్నెల
కొత్తకొత్తగా తోచింది
పత్తి వంటిది వెన్నెల
అత్త మనసులా వెన్నెల

ఇష్టమైననది వెన్నెల
శ్రేష్టమైనది వెన్నెల
ముద్దబంతి పువ్వుల్లా
ముద్దులొలికే వెన్నెలమ్మ


కామెంట్‌లు